ఈ నెల 5న ప్రారంభించిన తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆరో  రోజుకు చేరుకుంది. అయినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై స్పందించలేదు. ఓవైపు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న  ప్రభుత్వం మాత్రం ఇంకా నిరంకుశ వైఖరిని అవలంబిస్తోందని ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సమ్మె పై చర్చల మీద చర్చలు జరుపుతున్నారు కానీ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ఇప్పటివరకు స్పందించలేదు. అయితే ఆర్టిసి సమ్మెలో పాల్గొంటున్న కార్మికుల ఉద్యోగాల నుండి తొలగిస్తామని ఇప్పటికే కేసీఆర్ హెచ్చరించిన విషయం తెలిసిందే. 

 

 

 

 

 

 అయితే దీనిపై స్పందించిన తెలంగాణ ఆర్టిసి ఐకాస చైర్మన్ అశ్వద్ధామ రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ సమ్మెపై  హైకోర్టుకు తమ వాదన వినిపించాలని అశ్వత్థామరెడ్డి అన్నారు. కాగా  ఆర్టీసీ కార్మికుల వాదనపై  విచారణను  కోర్టు ఈనెల 15కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఆర్టీసీని కాపాడేందుకే తాము సమ్మె చేస్తున్నామని స్వప్రయోజనాల కోసం సమ్మె చేయడం లేదని అశ్వద్ధామ రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు తమకు ఎలాంటి  నోటీసులు రాలేదని... ఒకవేళ వస్తే వాటిపై స్పందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె పై వాస్తవాలను గ్రహించి ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేలా కార్యాచరణ చేపట్టాలని అశ్వద్ధామ రెడ్డి కోరారు. 

 

 

 

 

 

 కార్మికుల ఉద్యోగాలకు ఇబ్బందేమీ లేదని చెప్పిన అశ్వద్ధామ రెడ్డి... ఇదే స్ఫూర్తితో కార్మికులందరూ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మె  కొనసాగించాలని సూచించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సరైన పరిష్కారం చూపించే వరకు సమ్మె విరమించేది లేదని మరోసారి తెలంగాణ ఆర్టీసీ ఐకాస చైర్మన్ అశ్వద్ధామ రెడ్డి స్పష్టం చేశారు. కాగా  ఉద్యమాలను అణచివేసే ప్రయత్నం చేసిన ఏ ప్రభుత్వానికైనా ఇబ్బందులు తప్పలేదని... ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు రాకుండా ఉండాలంటే సమ్మె చేపడుతున్న కార్మికులతో చర్చలు జరిపి వాళ్ల డిమాండ్ల పరిష్కారానికి ప్రయత్నం చేయాలని అశ్వద్ధామ రెడ్డి హితవు పలికారు.

మరింత సమాచారం తెలుసుకోండి: