తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఆరవ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆ రోజుకు చేరుకున్నప్పటికీ సీఎం కేసీఆర్ మాత్రం ఆర్టీసీ కార్మికుల డిమాండ్ ల పరిష్కారంపై ఇప్పటి వరకు సరైన స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు కూడా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు. కాగా రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో అదే ప్రైవేటు బస్సుల్లో ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది... ప్రభుత్వం తిప్పుతున్న బస్సులతో పూర్తిస్థాయిలో ప్రయాణికుల అవసరాలు తీరడం లేదు. కాగా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలను తొలగిస్తామని ఇప్పటికే కేసీఆర్  హెచ్చరించిన విషయం తెలిసిందే. 

 

 

 

 

 

 అయితే ఆర్టీసీ కార్మికుల సమ్మెకి  రోజు  రోజుకి మద్దతు పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే ఆర్టీసీ కార్మికుల సమ్మెకు రాజకీయ పార్టీలు తమ పూర్తి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక టీఎన్జీవో ఉద్యోగ సంఘాలు  మద్దతు కూడా పొందేందుకు  ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రయత్నిస్తున్నాయి . తెలంగాణ ఉద్యోగ సంఘాలు కూడా తమకు మద్దతు తెలిపితే...మరో సారి సకల జనుల సమ్మె లాగా ఆర్టీసీ సమ్మె మారుతుందని దీంతో  ప్రభుత్వం తమ డిమాండ్ల పరిష్కారానికి దిగి వస్తుందని ఆర్టీసీ కార్మికుల భావిస్తున్నారూ. ఈ నేపథ్యంలో తమకు మద్దతు తెలపాలని తెలంగాణ ఉద్యోగ సంఘాలను ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారు. అయితే నేడు సీఎం కేసీఆర్  ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్ గౌడ్ తో కలిసి  ప్రగతి భవన్ లో  సమావేశమయ్యారు. ఆర్టీసీ కార్మికులు ఉద్యోగ సంఘాల మద్దతు కోరుతున్న తరుణంలో ఈ సమావేశం ప్రాధాన్యతను  సంతరించుకుంది.

 

 

 

 

 

 కాగా ఈ సమావేశం పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి... డి ఏ పెంపు సహా  పిఆర్సి అంశంపై టీఎన్జీవో నేతలు కేసీఆర్ తో  చర్చించారని సమాచారం. అయితే వీటిపై కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. త్వరలోనే వీటిపై సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని కేసిఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఉద్యోగ సంఘాల మద్దతును ఆర్టీసీ కార్మికులు కోరుతారని ముందే ఊహించిన కేసీఆర్ ఈ సమావేశం నిర్వహించినట్లు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తుంది. ఇక టీఎన్జీవో ఉద్యోగ సంఘాల మద్దతు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు లభించకపోవచ్చు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: