ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబునాయుడు చివరకు నాలుగు పదుల వయస్సున్న జగన్మోహన్ రెడ్డిని కాపీ కొడుతున్నారు. కాకపోతే కాపీ కొట్టి అమలు చేయటానికి ఆయనేమీ అధికారంలో లేరు లేండి. అందుకనే పార్టీ కార్యక్రమాల్లోను, పార్టీ పదవుల్లోను కాపీ కొడుతున్నారు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే టిడిపిని బలోపేతం చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారట. అందుకోసం సమర్ధులకు పెద్ద పీట వేస్తారట. సమర్ధులు ఎలా దొరుకుతారు ? ఎలాగంటే సంస్ధాగత ఎన్నికల ద్వారానే సమర్ధులను గుర్తిస్తారట. అంటే గతంలో  సంస్ధాగత ఎన్నికలు జరగలేదా అంటే ఎందుకు జరగలేదు ? జరిగాయి కాకపోతే అంతా చంద్రబాబు చెప్పినట్లే జరిగేవి.

 

వచ్చే నెలలో పార్టీ సంస్ధాగత ఎన్నికలు జరుపుతారట. అందులో సమర్ధులనే ఎంపిక చేస్తారట. అంటే అప్పుడు కూడా చంద్రబాబు కనుసన్నల్లోని వాళ్ళే నామినేషన్లు వేస్తారు, వాళ్ళే ఎన్నికవుతారన్న విషయం అర్ధమైపోతోంది. కాకపోతే పదవుల్లో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటి, యువతకు పెద్దపీట వేస్తారని హామీ ఇచ్చారు. ఇక్కడే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ జగన్ ను కాపీ కొడుతున్నారు.

 

నామినేటెడ్ పదవుల భర్తిలోను, రూ. 5 లక్షల కాంట్రాక్టు పనుల్లోను మహిళలకు, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటి, కాపులకు రిజర్వేషన్ వర్తింపచేస్తూ జగన్ చట్టం చేసిన విషయం తెలిసిందే. దాన్నే ఇపుడు చంద్రబాబు పార్టీపరంగా కాపీ కొడుతున్నారు. అధికారంలో ఉన్నపుడు పై వర్గాలేవీ చంద్రబాబుకు గుర్తు రాలేదు.

 

చంద్రబాబుకు విలువలు, నీతులు, నియమ, నిబంధనలన్నీ ప్రతిపక్షంలోకి వచ్చినపుడు మాత్రమే గుర్తుకొస్తుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. అధికారంలో ఉన్నపుడు పార్టీలోని మహిళలు, యువత, ఎస్సీ, ఎస్టీ, మైనారిటి వర్గాలు చంద్రబాబుకు గుర్తుకు రాలేదు. అంటే అప్పట్లో అధికారమంతా తన బినామీలకు, తన వర్గం వాళ్ళకు మాత్రమే కట్టబెట్టారు.

 

ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో వెంటనే చంద్రబాబుకు అన్నీ వర్గాలు కావాల్సొస్తోంది. ఎందుకంటే మళ్ళీ రాబోయే ఎన్నికల్లో వాళ్ళంతా ఓట్లేయాలి కాబట్టి. చంద్రబాబు డ్రామాలను పై వర్గాలు గ్రహించాయి కాబట్టి మొన్నటి ఎన్నికల్లో కర్రకాల్చి వాత పెట్టారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: