మచిలీపట్నం లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర 36గంటల దీక్షకు పిలుపునివ్వడంతో అంత టెన్షన్ టెన్షన్ గా మారింది. దీక్ష ఆపేందుకు  ఎందుకు పోలీసులు రంగంలోకి దిగారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తలపెట్టిన 36 గంటల దీక్ష నేపథ్యంలో టిడిపి నాయకులు ఎవరు దీక్ష కు హాజరు కాకుండా ఉండడానికి పోలీసులు అందరిని గృహనిర్బంధం చేశారు. ఈ నేపథ్యంలో మచిలీపట్నంలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్నాయి. 

 

 

 

 

 

 మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు... ఆయనను గృహనిర్బంధం చేశారు. ఇక కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడిని, గృహ నిర్బంధం చేసి ఇంటికే పరిమితం చేశారు పోలీసులు. అర్జునుని పోలీసులు అరెస్టు చేశారన్న వార్త బయటకి రావడంతో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అర్జునుడు ఇంటి వద్దకు చేరుకోవడంతో ఆయన ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే దీనిపై స్పందించిన అడిషనల్ ఎస్పీ సత్తిబాబు... టిడిపి నాయకులు ఎవ్వరిని  తాము అరెస్టులు  చేయలేదని...ఊహాగానాలు, తప్పుడు వార్తలను నమ్మొద్దని   సూచించారు. టిడిపి వైసిపి పార్టీలు ఎవరికి కూడా శిబిరాలు ఏర్పాటుకు  అనుమతించలేదని ఎస్పీ తెలిపారు.

 

 

 

 

 

 డిఆర్పి సమావేశం ఉన్నందున శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తే ఉపేక్షించేది లేదని అడిషనల్ ఎస్పీ హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణకు అంతా సహకరించాలని ఆయన కోరారు. అయితే మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తలపెట్టిన 36 గంటలు దీక్ష పిలుపు నేపథ్యంలో... ఓవైపు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర గృహనిర్బంధం చేయడం... మరోవైపు నిరసన కార్యక్రమానికి బయల్దేరిన టిడిపి నేతల గృహనిర్బంధం చేయడం తో మచిలీపట్నంలో మొత్తం టెన్షన్ వాతావరణం నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: