బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 రియాల్టీ షో తెలుగు  టెలివిజన్  చరిత్రలో తన హవా నడిపిస్తుందనే  చెప్పాలి. బుల్లితెరపై  టాప్ రేటింగ్ దూసుకుపోతూ టీవీ ప్రేక్షకులను ఆకర్షిస్తుంది బిగ్ బాస్ తెలుగు సీజన్ 3. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 రియాల్టీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాగార్జున... దుమ్మురేపుతున్నారనే  చెప్పాలి. అప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన అనుభవం ఉండడంతో బిగ్ బాస్ 3 లో నాగార్జున  ఇరగదీస్తున్నాడు. అయితే తాజాగా దసరా పండుగ సందర్భంగా హౌస్ లోకి వెళ్లిన నాగార్జున కంటెస్టెంట్స్ తో... ఫన్నీ టాస్క్ లు చేస్తూ సందడి చేశారు. అయితే ఈ సందర్భంగా బయట బిగ్ బాస్ 3 షో బాగా సక్సెస్ అయిందని... సీజన్ 1,  సీజన్ 2 కంటే సీజన్ 3 బాగా సక్సెస్ అయిందని నాగార్జున కంటెస్టెంట్స్ తో తెలిపారు. 

 

 

 

 

 కాగా బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్లో షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించిన జూనియర్ ఎన్టీఆర్... షోకే స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. ఓవైపు ఎన్టీఆర్ చేసిన సందడి ప్లస్ అవ్వగా... మరోవైపు కంటెస్టెంట్స్ కూడా బిగ్ బాస్ సీజన్ 1 హిట్ అవడానికి బాగా ప్లస్ అయ్యారు . నవదీప్,  శివ బాలాజీ అర్చన, హరితేజ,  ఆదర్స్ లాంటి కంటెస్టెంట్స్ ఉండడంతో షో కి కాస్త ప్లస్ పాయింట్ గా కూడా మారింది. బిగ్ బాస్1 లో కంటెస్టెంట్స్ అందరూ ఏ టాస్క్ ఇచ్చినా అందులో ప్రేక్షకులను కామెడీతో అలరించేవారు. అయితే ఆ తర్వాత వచ్చిన బిగ్ బాస్ సీజన్ 2 ని  నాని హోస్ట్  చేశాడు. అయితే నాని హోస్టింగ్ ను  ఎన్టీఆర్ హోసింగ్ తో పోల్చి చూసినా ప్రేక్షకులు నాని హౌసింగ్ కాస్త డల్ గా ఉందని భావించారు... ఇక బిగ్ బాస్ సీజన్ 2 లో బిగ్ బాస్ హౌస్ లోకి  వచ్చిన కంటెస్టెంట్స్ కూడా  ప్రేక్షకులను అంతగా ఆకర్షించలేక పోయారని  చెప్పొచ్చు. ఇక కౌశల్ ఆర్మీ పుట్టుకు రావడం తో బిగ్ బాస్ సీజన్ 2 మొత్తం కౌశల్ ఆర్మీ చేతిలోకి వెళ్ళినట్లయితే. దీంతో షో కి ఆదరణ కరువైంది.

 

 

 

 

 

 అయితే ప్రస్తుతం ప్రసారం అవుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో  నాగార్జున హోస్టింగ్ ఓ ప్లస్ పాయింట్ గానే చెప్పాలి. నాగార్జున హోస్టింగ్ అయితే ఎక్కడ పేరు పెట్టడానికి వీల్లేదు... కానీ బిగ్ బాస్ 3 హౌస్ లో మాత్రం కంటెస్టెంట్స్ నుంచి ఎంటర్టైన్మెంట్ కొరవడింది. ఎప్పుడు కాంట్రవర్సి గొడవలు తప్ప... కొంచమైనా ఎంటర్టైన్మెంట్ అందించడం లేదు ప్రేక్షకులకు. దీంతో సీజన్ వన్ కి వచ్చినంత ఆదరణ సీజన్ 3 కాస్త కరువైందని చెప్పాలి. మరి దసరా సందర్భంగా హౌస్ లోకి ఎంటరైన నాగార్జున సీజన్ 1, 2 కంటే బిగ్ బాస్ సీజన్ 3 హిట్ అయింది  అని చెప్పడం వెనుక అంతర్యం ఏమిటని అందరూ ఆలోచనలో పడ్డారు . రేటింగ్స్ పరంగానా లేదా ప్రేక్షకుల ఆదరణ పరంగా హిట్ అయిందా అనేది  మాత్రం క్లారిటీ ఇవ్వలేదు నాగార్జున . ఇక నాగార్జున చెప్పిన మాట నిజమా కాదా అనే ఆలోచనలో పడ్డారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: