నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. నగర పరిస్థితి చినుకు పడితే చిత్తడే  అన్న చందంగా మారడంతో... వర్షం పేరు మాట వస్తే చాలు  జంకుతున్నారు  జనం. ఇక భారీ వర్షం పడితే ఎప్పుడు ఎటునుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని భయబ్రాంతులకు లోనవుతున్నారు. ముందే వర్షాకాలం కావడంతో విషజ్వరాలు ప్రబళుతుండడం... మరోవైపు భారీ వర్షాలతో ఇళ్లలోకి నీరు వస్తుండడంతో ఏం చేయాలో కూడా తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు నగర వాసుల . ఇక లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్థితి అయితే  మరీ అధ్వానంగా తయారైంది. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం ఇవ్వడంతో లోతట్టు  ప్రాంతాల ప్రజల జీవనం స్తంభించి పోతుంది. 

 

 

 

 

 ఇక నగరంలో ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్త ... భారీవర్షం తో పొంగిపొర్లుతున్న  మ్యాన్  హోల్స్... ఎటు  చూసిన చెరువులను తలపించే పరిసరాలు ... అబ్బో భారీ వర్షాలతో నగరం మహా సుందరంగా మారిపోయింది. ఎంత సుందరంగా అంటే పెద్ద పెద్ద చెరువులు వాగులు చూడాలనుకునే వారికి... నగరంలో భారీ వర్షాలు  వచ్చినప్పుడు... పెద్ద పెద్ద చెరువులు వాగులు అన్నీ మన ముంగిట దర్శనమిచ్చేంత  సుందరంగా ఉంది నగరం పరిస్థితి . నగరంలో భారీ వర్షాలతో వరద నీరు చేరి రహదారులన్నీ మునిగిపోవడంతో... చెరువులను తలపిస్తున్న రహదారులపై పడవలో వెళ్లాలా వాహనంలో వెళ్లాలో అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం నగరవాసులది. 

 

 

 

 

 ఎటు చూసినా బురదమయంగా మహా సుందరంగా కనిపిస్తుంది నగరం. అదేదో సినిమాలో రంగు పడుద్ది అనే డైలాగ్... ప్రస్తుత హైదరాబాద్ పరిస్థితికి  సరిగ్గా  సరిపోతుంది. కాస్త ఆదమరచిన బురద పడిపోద్ది. అందుకే రోడ్  పక్కన నడిచే  వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉంటే బురద నుంచి తప్పించుకోవచ్చు. నగర ప్రజలు అందరూ చేసేదేమీలేక బురదలోనే ప్రయాణం చేస్తున్నారు . బురద  మయంగా మారిన పరిసరాల దగ్గరికి దోమలు ఈగలు చేరి... ఒక్కసారిగా మనుషులపై దండయాత్ర  చేస్తున్నాయి. దీంతో ప్రజలందరూ రోగాల బారిన పడి  ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి జేబులను గుల్ల   చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: