చంద్రముఖి సినిమాలో హీరోయిన్ ఎలా పూటకో మాట మాట్లాడుతుందో అందరికీ గుర్తుండే ఉంటుంది. మామూలుగా ఉన్నపుడు హీరోయిన్ ఒకలాగ చంద్రముఖిలా మారిపోయినపుడు మరోలాగ మాట్లాడటం అందరికీ గుర్తుండే ఉంటుంది. చంద్రబాబునాయుడు తీరు కూడా అలాగే తయారైపోయింది.  కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన నిధులకు రాష్ట్రం లెక్కలు చెప్పాల్సిందే అని డిమాండ్ చేయటం విచిత్రంగా ఉంది.

 

రెండు రోజుల పర్యటనకు వెళ్ళిన చంద్రబాబు నేతలు, కార్యకర్తలతో మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అనేక నిధులిస్తున్నట్లు చెప్పారు. కేంద్రం నుండి వచ్చే నిధులకు రాష్ట్రప్రభుత్వం  లెక్కలు చెప్పకపోతే మళ్ళీ నిధులు ఎలా వస్తుందంటూ ప్రభుత్వాన్ని నిలదీయటమే ఆశ్చర్యంగా ఉంది.

 

తాను సిఎంగా ఉన్నపుడు కేంద్రం నుండి వచ్చిన నిధులకు లెక్కలు చెప్పాల్సిన అవసరం రాష్ట్రప్రభుత్వానికి లేదని ఊరూరు తిరిగి చెప్పిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో తానిచ్చిన నిధులకు లెక్కలు చెప్పమని కేంద్రప్రభుత్వం అడిగింది. దాంతో చంద్రబాబు కేంద్రంపై భగ్గుమన్నారు. నిధులు ఇవ్వటమే కేంద్రం బాధ్యత అని లెక్కలడిగితే  చెప్పాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వానికి లేదని చెప్పారు.

 

విషయం ఏమిటంటే కేంద్రం నుండి వచ్చిన నిధులను తనిష్టం వచ్చినట్లు దారిమళ్ళించి వాడేసుకున్నారు. కేంద్రం ఒక పథకానికి నిధులిస్తే చంద్రబాబు మాత్రం ఇంకో పథకానికి మళ్ళించేశారు. దాంతో కేంద్రం నిధులకు లెక్కలడిగింది. లెక్కలు చెప్పకపోవటంతో నిధులను ఆపేసింది. దాంతో కేంద్రం తీరుపై  చంద్రబాబు గగ్గోలు పెట్టేశారు.

 

సరే మొన్నటి ఎన్నికల్లో జనాలు చంద్రబాబుకు ఏ విధంగా బుద్ధి చెప్పింది అందరూ చూసిందే. దాంతో ప్రతిపక్షంలో కూర్చున్న చంద్రబాబు ఇపుడు చంద్రముఖిలాగ మాట్లాడుతున్నారు. కేంద్రం నుండి వచ్చిన నిధులకు రాష్ట్రప్రభుత్వం లెక్కలు చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది. తాను అధికారంలో ఉన్నపుడు ఒకలాగ మాట్లాడిన చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చున్నపుడు ఇంకోలా మాట్లాడటాన్ని చంద్రముఖి మనస్తత్వమే కనబడుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: