బంగారం ధర మళ్ళి భారీగా తగ్గింది. ఒకరోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది. మొన్నటికి మొన్న భారీగా తగ్గిన బంగారం ధర నిన్నటికి నిన్న భారీగా పెరిగింది. ఈరోజు బంగారం ధర మళ్ళి భారీగా దిగొచ్చింది. అయితే వెండి ధర మాత్రం భారీగా పెరగటం మొదలు పెట్టింది. హైదరాబాద్ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.270 తగ్గుదలతో రూ.39,710కు చేరింది. 

                            

ఈ నేపథ్యంలోనే 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర రూ.270 తగ్గి రూ.36,380 వద్దకు చేరింది. బంగారం ధర తగ్గిన వెండి ధర మాత్రం భారీగా పెరిగింది. కేజీ వెండి ధరలో రూ100 పెరిగి రూ.48,600కు చేరింది. ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర భారీగా పడిపోయింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.300 తగ్గి రూ.38,200కు చేరింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.300 క్షీణించి రూ.37,150కు తగ్గింది.

                     

అంతర్జాతీయ మార్కెట్‌లో శనివారం బంగారం ధర దిగొచ్చింది. బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఏకంగా 1,500 డాలర్ల క్షీణించింది. దీంతో ఔన్స్ బంగారం ధర 0.50 శాతం క్షీణతతో 1,493.05 డాలర్లకు తగ్గింది. అందుకే బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఏది ఏమైనా బంగారం ధర తగ్గడం పసిడి ప్రియులకు ఊరటనిస్తోంది.  

                           

మరింత సమాచారం తెలుసుకోండి: