కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ తీపి కబురు వినిపించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు  అందరికీ డియర్ నెస్ అలవెన్స్ అను ఐదు శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది మోదీ సర్కార్. నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు డియర్ నెస్ అలవెన్స్ 12 శాతం నుంచి ఏకంగా 17 శాతానికి పెరిగింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో ఉద్యోగులు సహా పెన్షనర్లు  ప్రయోజనం చేకూరనుంది. డియర్ నెస్ అలవెన్స్ తో పాటు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అని కూడా పెంచింది కేంద్రం. 

 

 

 

 

 

 డిఏ పెంపు, టిఏ పెంపు  నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎనిమిది వందల పది రూపాయల నుండి నాలుగు వేల మూడు వందల ఇరవై రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అందరి ఖాతాల్లో  ప్రతి నెల వేతనంతో పాటు... కేంద్ర ప్రభుత్వం పెంచిన డిఏ, టిఏ అలవెన్సులు  ఆటోమేటిక్ గా జమఅవుతాయి . కాగా డి ఏ పెంపు టి ఏ పెంపు అనేది ఇంటర్ కనెక్టెడ్ గా ఉంటాయని మోడీ  సర్కార్  చెబుతోంది. అందువల్లే డి ఏ పెంపు తో టి ఏ పెంపు కూడా జరుగుతుందని తెలిపారు. కాగా  ఏడవ వేతన సంఘం సిఫారసుల మేరకు  ఉద్యోగిగా నియామకమై అప్పటికీ సిటీ కేటగిరి ప్రతిపాదికన వాళ్ళకి  ట్రావెల్స్ అలవెన్సులు అందించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. 

 

 

 

 

 

 కాగా  ఏడవ సిపిసి ప్రకారం... అర్బన్ సిటీస్ లో పని చేసే  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ట్రావెలింగ్ అలవెన్స్ 1350 రూపాయలు ఉండగా గరిష్ఠంగా 7,200 రూపాయలు కూడా ఉంది. ఇక చిన్న చిన్న పట్టణాల్లో పని చేసే  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తొమ్మిది వందల రూపాయల నుంచి 3 వేల 600 రూపాయల మధ్యలో  ట్రావెల్ అలవెన్స్ ఉంది  . కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం టైర్ 1 పట్టణాల్లో డియర్ నెస్ అలవెన్స్ 5% పెరిగితే ట్రాన్స్ పోర్ట్ అలవెన్సులు కూడా 5 శాతం మేర పెరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం కేంద్రం నిర్ణయంతో టైర్ 1 పట్టణాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 7200 రూపాయలు అప్రూవ్డ్ టిఏ  369 అవ్వనుంది .ఇక దీంతో  ఏడాదిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం  4320 రూపాయలు పెరగబోతుంది.కాగా  మోడీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ వేతనం పెంపు అనే తీపి కబురు చెప్పడంతో ఉద్యోగులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: