స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా (సిమి) కు చెందిన టెర్రరిస్టు అజారుద్దీన్ నిన్న హైదరాబాద్ విమానాశ్రయంలో ఛత్తీస్ఘర్ పోలీసుల చేతికి చిక్కాడు. 'కెమికల్ అలీ' అని పిలవబడే అజారుద్దీన్ కు బోధ్ గయ మరియు పాట్నాలో 2013లో జరిగిన బాంబు బ్లాస్ట్ లలో సంబంధం ఉంది. అతను సౌదీ అరేబియా నుండి హైదరాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ కాగానే అతనిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రాయ్ పూర్ లోని మౌధాపరా ఉండే అజారుద్దీన్ కి చాలా పేళ్లుల్లతో సంబంధాలు ఉండగా గత ఆరేళ్ల నుంచి సౌదీ అరేబియా పారిపోయి అక్కడ డ్రైవర్ గా మరియు ఒక సూపర్ మార్కెట్ లో సేల్స్ మెన్ గా పని చేస్తున్నాడు.

అతని గురించి వచ్చిన పక్కా ఇన్ఫర్మేషన్ తో చత్తీస్ఘర్ పోలీసులు అతనిని మాటువేసి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సహాయంతో విమానాశ్రయంలో దిగగానే అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అసలు అతను హైదరాబాద్ కి ఎందుకు వచ్చినట్లు? అతను రాయపూర్ కి చెందినవాడు. అసలు హైదరాబాదులో అతనికి పని ఏమిటి అని పోలీసులు విచారిస్తున్నారు. అతని దగ్గర అ ఒక పాస్ పోర్టు, 2 డ్రైవింగ్ లైసెన్సులు ఒక ఓటింగ్ పాస్ మరియు ఓటర్ ఐడెంటిటీ లభ్యం కాగా వాటిల్లో హైదరాబాద్ నుంచి చతిస్గడ్ వెళ్లేందుకు ఎలాంటి టికెట్ లేకపోవడం గమనార్హం.

ఇకపోతే 2013లో ఎంతో మంది బౌద్ధ మతస్థులు పవిత్రంగా భావించే బోధి చెట్టు దగ్గర జరిగిన బ్లాస్ట్ లో ఇతని హస్తం ఉంది. దాదాపు ముప్పై నిమిషాలలో తొమ్మిది చోట్ల పేర్లు జరగా అదే సంవత్సరంలో పాట్నాలో నరేంద్ర మోడీ కొద్దిసేపట్లో ఒక పార్టీ సమావేశానికి హాజరవుతారు అనగా మరికొన్ని పేలుళ్లు జరిగాయి. ఆ పేలుళ్లకు సంబంధించి 17 మందిని అరెస్టు చేయగా వాటికి సంబంధించి ముఖ్య పాత్ర పోషించి, నేరస్తులకి ఆశ్రమం ఏర్పాటు చేసిన అజారుద్దీన్ మాత్రం అప్పుడు తప్పించుకుని సౌదీకి వెళ్లిపోయాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: