దసరా సందడి ముగిసింది. దీపావళీ సందడికి ఆరంభం మొదలైంది. ఇకపోతే ఈ దీపావళీ రవాణ వ్యవస్ధలో ఆర్టీసీ ఎంత మాత్రం తన పాత్రను పోషిస్తుందో తెలియదు. ఎందుకంటే గత 9రోజుల నుండి కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటి నుండే దీపావళి పండగ, శీతా కాలం రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లని నడపనున్నట్లు రైల్వే సీపీఆర్‌వో రాకేష్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.


గుంటూరు మీదగా 12  ప్రత్యేక రైళ్లని నడపనున్నట్లు తెలిసింది..వాటి సమయాలు ఏవో తెలుసుకుంటే. ట్రైన్ నెంబరు. 07049 మచిలీపట్నం – సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు నవంబరు నెలలో ప్రతీ ఆదివారం మధ్యాహ్నం 2.25 గంటలకు బయలుదేరి సాయంత్రం 4.55కి గుంటూరు, 5.40కి సత్తెనపల్లి, రాత్రి 7.34కి మిర్యాలగూడ, 8.05కి నల్గొండ, 10.10కి సికింద్రాబాద్‌ చేరుకొంటుంది. నెంబరు. 07050 సికింద్రాబాద్‌ – మచిలీపట్నం ప్రత్యేక రైలు నవంబరు నెలలో ప్రతీ ఆదివారం రాత్రి 11.55 కి అర్ధరాత్రి దాటాక 1.25 కి నల్గొండ, 1.55 కి మిర్యాలగూడ, సోమవారం వేకుజవామున 4.25 కి సత్తెనపల్లి, 5.40 కి గుంటూరు, ఉదయం 8.55 కి మచిలీపట్నం చేరుకొంటుంది.


నెంబరు. 07258 నరసాపూర్‌ – హైదరాబాద్‌ ప్రత్యేక రైలు నవంబరు నెలలో ప్రతీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరి రాత్రి 11 గం టలకు గుంటూరు, 11.30 కి సత్తెనపల్లి, అర్ధరాత్రి 12.01 కి పిడుగురాళ్ల, 12.24 కి నడికకుడి, 12.55కి మిర్యాలగూడ, 1.30 కి నల్గొండ, సోమవారం వేకువజామున 3.55 కి సికింద్రాబాద్‌, 4.45 కి హైదరాబాద్‌ దక్కన్‌ (నాంపల్లి) కి చేరుకొంటుంది.


ఈ రైళ్లలో ఏసీ టూటైర్‌, త్రీటైర్‌, స్లీపర్‌ క్లాస్‌, జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ బోగీలుంటాయని సీపీఆర్‌వో తెలిపారు. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే ప్రయాణికులు ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకోగలరని రైల్వే అధికారులు ప్రకటించారు. తీరా పండగ సమయంలో హడావుడి పడటం కంటే ముందుగానే రిజర్వేషన్ చేసుకోని తమ ప్రయాణాన్ని ఆనందగా కొనసాగించాలని కోరుకుంటున్నామని తెలిపారు...

మరింత సమాచారం తెలుసుకోండి: