రాజకీయాలతో పాటు సోషల్ మీడియాలో కూడా అత్యంత క్రియాశీలక పాత్ర పోషించే వారిలో  ముందువరుసలో ఉండేది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ . అయితే ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా లో సరికొత్త రికార్డు సృష్టించారు. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోడీ మిగతా ప్రపంచ స్థాయి నేతలను కూడా అధిగమించి ... సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఎవరికి దక్కని రీతిలో 30 మిలియన్ల మంది ఫాలోవర్లు సంపాదించుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ట్విట్టర్ లో భారీ సంఖ్యలో అభిమానులున్న ప్రధాని నరేంద్ర మోడీ... ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో కూడా ఎక్కువ ఫాలోవర్స్  ఉన్న నెంబర్ వన్ పొలిటిషన్ గా అవతరించాడు. 

 

 

 

 

 13వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ మైలురాయిని అందుకున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆక్టివ్ గా ఉండే  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ... ప్రపంచ స్థాయిలో ఇంస్టాగ్రామ్ లో ఈ స్థాయిలో ఫాలోవర్స్ ఉన్న  పొలిటీషియన్    మోది  ఒక్కరే. కాగా  ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత రెండవ స్థానంలో 25.06 మిలియన్ ఫాలోవర్స్ లతో ఇండోనేషియా ప్రధాన జోకో  విడోడో  ఉన్నారు.అమెరికా మాజీ అధ్యక్షుడు   బరాక్ ఒబామా 24.8 మిలియన్ల  ఫాలోవర్లు ఉండగా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్  14.9 మిలియన్ల ఫాలోవర్లని కలిగి ఉన్నాడు . అందరికంటే ఎక్కువ ఫాలోవర్లు కలిగిన రాజకీయ వేత్తగా  మోడీ  ప్రథమ స్థానంలో ఉండటం విశేషం.

 

 

 

 

 

 ఇక ఫేస్ బుక్ లో కూడా ప్రధాని మోడీ కి 44 మిలియన్ లైకులు ఉన్నాయి. అయితే ఇంస్టాగ్రామ్ లో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఫాలోవర్స్  ఉన్న వ్యక్తి పోర్చుగీస్ ఫుట్బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రోనాల్డో. ఏకంగా 186 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఏదేమైనా దేశ ప్రధాని మోదీ అటు రాజకీయాల్లోనే కాదు ఇటు సోషల్ మీడియాలో కూడా తన హవా నడిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: