బంగారం ధర నేడు స్వల్పంగా పెరుగుతూ వచ్చింది. హైదరాబాద్ మార్కెట్ లో నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా 10 రూపాయిల పెరుగుదలతో రూ.39,770కు చేరింది. ఈ నేపథ్యంలోనే 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా 10 రూపాయిల పెరుగుదలతో రూ.36,450కు చేరింది.        

                           

బంగారం ధర పరుగులు పెడుతున్నప్పటికీ వెండి ధర మాత్రం వెనకడుగు వేసింది. కేజీ వెండి ధర 15 రూపాయిలు తగ్గుదలతో రూ. 48,545కు చేరింది. బంగారం ధర పెరగటానికి కారణం అంతర్జాతీయంగా సహా జువెలర్ల నుంచి భారీ డిమాండ్ పుంజుకోవడంతో బంగారం ధరపై సానుకూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. 

              

కాగా బంగారం ఇదే బాటలో ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర కూడా స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరుగుదలతో రూ.38,260కు చేరింది. ఇదే తరహాలోనే 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 పెరుగుదలతో రూ.37,210కు చేరింది. 

                    

పండగ వేళా కావడంతో దేశం అంత బంగారం కొనుగోలు చేస్తున్నారని, దీపావళి సమయానికి బంగారం ధర మరింత పెరగచ్ఛని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. బంగారం పెరిగితే పసిడి ప్రియులకు షాక్ అనే చెప్పలి. అందుకే కొనాలి అనుకుంటే బంగారం ఇప్పుడే వెళ్లి కోనేయండి. 

                            

మరింత సమాచారం తెలుసుకోండి: