ఇపుడిదే ప్రశ్న అందరిలోన మొదలైంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదురైన తర్వాత చంద్రబాబునాయుడు ఇపుడు జిల్లాల పర్యటనలు పెట్టుకున్నారు. ఎవరైనా జిల్లాల పర్యటనలు ఎందుకు పెట్టుకుంటారు ? పార్టీని బలోపేతం చేయటం కోసం. లేకపోతే  నేతల మధ్యున్న విభేదాలను తొలగించి అందరిని ఏకతాటి మీదకు తేవటం, లోపాలను సరిదిద్దుకోవటం తదితరాల కోసం.

 

కానీ చంద్రబాబు ఏం చేస్తున్నారు ? పై చెప్పుకున్న వాటిల్లో వేటిపైనా టిడిపి అధినేత దృష్టి పెట్టటం లేదని తెలిసిపోతోంది. టిడిపికి ఎదురైన ఘోర ఓటమికి ఇప్పటికీ చంద్రబాబు ప్రజలనే నిందిస్తున్నారు. నిజానికి జనాలను మోసం చేయాలని అనుకున్నదే చంద్రబాబు. కాకపోతే ఆయన మోసంలో పడకుండా జనాలు విజ్ఞత చూపించారు. దాన్నే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు.

 

నాలుగు రోజుల క్రితమే విశాఖపట్నం జిల్లాలో రెండు రోజులు పర్యటించారు. అక్కడా జగన్మోహన్ రెడ్డికి  శాపనార్ధాలు పెట్టటం, జనాలను నిందించటంతోనే సరిపోయింది. ప్రతి నియోజకవర్గంలోను టిడిపి అభ్యర్ధుల  ఓటమికి అనేక కారణాలున్నాయి. వాటిపై చర్చలు జరిపి లోపాలను సర్దుబాటు చేసుకోవాల్సిన చంద్రబాబు తన పాలన బ్రహ్మాండంగా ఉన్న జనాలు ఓడించారనే ఏడుస్తున్నారు.

 

తమకు ఎవరైతే నచ్చుతారో వాళ్ళని గెలిపించుకునే స్వేచ్చ జనాలకుందన్న విషయాన్ని కూడా చంద్రబాబు మరచిపోయారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన జనాలంతా తననే గెలిపించాలని, తన మాటే వినాలని, తానిచ్చిన తప్పుడు హామీలనే నమ్మాలనే విచిత్రమైన భ్రమలో చంద్రబాబు కూరుకుపోయారు. అందుకనే టిడిపిని ఓడించి జనాలే తప్పు చేశారనే విచిత్రమైన వాదనతో పర్యటనలు చేస్తున్నారు.

 

చంద్రబాబు వాదనను పార్టీలోని నేతలే చాలామంది విభేదిస్తున్నారు. వాస్తవమేంటో కొందరు నేతలు చంద్రబాబుకు చెప్పినా వినిపించుకోటం లేదు. దాంతో వాళ్ళు కూడా చంద్రబాబుకు సలహాలు ఇవ్వటాన్ని మానుకున్నారు. కాబట్టి ఇటువంటి పర్యటనలు ఎన్ని చేసినా ఎటువంటి ఉపయోగం ఉండదని చంద్రబాబు ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: