ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేస్తారనే దానిపై అందరికీ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో హైకోర్టును  కర్నూలులో ఏర్పాటు చేయాలని న్యాయ వాదులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దీని కోసం నిరసనలు కూడా వ్యక్తం చేశారు. అయితే కొద్ది రోజులుగా కామ్ గా ఉన్న న్యాయవాదులు  హైకోర్టు ను కర్నూల్ లోనే ఏర్పాటు చేయాలంటూ మళ్లీ నిరసనకు దిగారు. దీంతో రాయలసీమలో హైకోర్టు హైకోర్టు వివాదం మళ్ళీ రాజుకుంది. హైకోర్టును రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని కర్నూలు జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. అయితే నెల రోజుల నుండి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు నిరసన తెలుపుతున్న కనీసం స్పందించడం లేదని భగ్గుమన్నారు న్యాయవాదులు. 

 

 

 

 

 

 దీంతో కోర్టు కు తాళం వేసి కోర్టు ముందు బైఠాయించి నిరసన తెలిపారు న్యాయవాదులు . ఈ నేపథ్యంలో కోర్టు కు వచ్చిన జిల్లా జడ్జ్  ఆలపాటి గిరిధర్ వాహనాన్ని అడ్డుకున్నారు న్యాయవాదులు. ఈ నేపథ్యంలో మున్సిఫ్ కోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కోర్టు దగ్గరికి  భారీగా పోలీసులు మోహరించారు. ఇక న్యాయవాదులు కూడా కోర్టు ముందు బైఠాయించి వి వాంట్ జస్టిస్   అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టును ఎట్టి పరిస్థితుల్లో కర్నూల్ లోనే ఏర్పాటు చేయాలని న్యాయ వాదులు డిమాండ్ చేస్తున్నారు. 

 

 

 

 

 

 గత ముప్పై మూడు రోజులుగా న్యాయవాదులు హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు కానీ ఇప్పటివరకు న్యాయవాదుల నిరసన లపై కనీసం ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆగ్రహించిన న్యాయవాదులు... నిరసనలను ఉదృతం చేశారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా వ్యాప్తంగా నిరసన సెగలు ఎక్కువయ్యాయి. గత నెల రోజుల నుండి న్యాయవాదులు తమ విధులకు హాజరు కాకుండా హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే నేడు కర్నూల్ లోని మున్సిప్  కోర్టుకి తాళం వేసి విధులను బహిష్కరించి జిల్లా కోర్టు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో కోర్టు వద్దకు చేరుకున్న జిల్లా జడ్జి  వాహనాన్ని అడ్డుకున్నారు న్యాయవాదులు.దీంతో అక్కడ ఉద్రిక్త  పరిస్థితులకు దారితీసింది . దీంతో కోర్టు వద్దకి  భారీగా మోహరించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా న్యాయవాదులు పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగుతున్నారు. ఏదేమైనా కర్నూలులో హైకోర్టు అంశం మళ్ళీ రాజుకున్నట్లుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: