మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమా విడుదలై మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ  సమయంలో చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ని కుటుంబంతో సహా కలిశాడు. అయితే అలా కలవడానికి గల కారణం "సైరా" సినిమా చూడమని చెప్పడానికట. కానీ మెగాస్టార్ స్వయానా జగన్ ని కలుస్తున్నాడంటే అక్కడ ఏదో వేరే కారణం ఉండే ఉంటుందని అందరూ అనుకొన్నారు. ఆ కారణం గంటా శ్రీనివాసరావు.


గంటా శ్రీనివాసరావు చిరంజీవి వియ్యంకుడు. మొన్నటి వరకు తెలుగుదేశంలో కీలక వ్యక్తి. అయితే గత కొన్ని రోజులుగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఆస్తులకి సంబంధించిన కేసుల్లో వైసీపీ శ్రేణులకి టార్గెట్ అవుతున్నాడు. అందుకే పార్టీని వీడి వైసీపీలో చేరాలని అనుకుంటున్నాడట. కానీ వైసీపీలో చేరడం అంత ఈజీ కాదు. పార్టీ మారి వచ్చి వ్యక్తులకి కొన్ని షరతులు పెట్టారు. అవసరమైన వాటి కంటే ఎక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి ఎన్ని షరతులైన పెట్టుకుంటారు.


అది వాళ్ళిష్టం. కానీ అదే ఇప్పుడు టిడిపి వాళ్ళకి కష్టమైపోతుంది. పార్టీ మారాలంటే తమకున్న పదవికి రాజీనామా చేసి రావాలట.  అలా ఖాళీ అయిన స్థానంలో మళ్ళీ ఉపఎన్నిక జరుగుతుంది. అపుడు ఆ స్థానంలో వైసిపి తరపున వ్యక్తిని గెలిపించుకోవాలట. అదే ఇప్పుడు గంటాకి మింగుడుపడటం లేదు. ఏ పదవికి రాజీనామా చేసి వస్తే మళ్ళీ వైసీపీలో పదవి దక్కించుకోవడం అంతా మామూలు విషయం కాదు.


అందుకే చిరంజీవితో రాయబారానికి సిద్ధమయ్యాడు. చిరంజీవి చెప్తే అయినా జగన్ వింటాడని గంటా నమ్మకం. దానికి "సైరా" సినిమాని ఒక సాకుగా చూపించారని టాక్. చిరంజీవి బలమైన నాయకుడు. ప్రస్తుతం రాజకీయాల్లో లేనప్పటికీ ఒక వర్గాన్ని కదిలించే సత్తా ఆయనకు ఉంది. మరి వీటిని దృష్టిలో ఉంచుకుని జగన్ చిరంజీవి మాటని ఆలకిస్తాడా లేదా అనేది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: