రోజులు దగ్గర పడుతున్నా తండ్రి, కొడుకులు అడ్రస్ మాత్రం కనబడటం లేదు. మరో వారం రోజుల్లో నల్గొండ జిల్లాలోని హుజూర్ నగర్ ఉపఎన్నిక జరగబోతోంది. అభ్యర్ధినైతే దింపారు కానీ తర్వాత గాలికొదిలేశారు. ఏదో సెటిలర్ల ఓట్లు ఎక్కువగా ఉన్నాయని, కమ్మ సామాజక వర్గానికి చెందిన మహిళా నేత అన్న కారణంతో చావా కిరణ్మయిని పోటీలోకి దింపారు చంద్రబాబు.

 

నామినేషన్ వేసిన దగ్గర నుండి కిరణ్మయికి మద్దతుగా చంద్రబాబు ఒక్కసారి కూడా ప్రచారానికి వెళ్ళలేదు. తాను వెళ్ళకపోవటం అటుంచితే కనీసం చినబాబు నారా లోకేష్ కూడా అటువైపు తొంగికూడా చూడలేదు. మొన్నటి ఎన్నికల్లో మంగళగిరిని మందలగిరి అని, పోలింగ్ 11వ తేదీ అయితే 9వ తేదీన ఓట్లేయండని లోకేష్ చేసిన ప్రచారం అప్పట్లో సంచలనంగా మారిన విషయం అందరికీ తెలిసిందే.

 

తనను తాను చాలా గొప్ప నేతగా భుజాలు చరుచుకునే లోకేష్ తన నియోజకవర్గాన్ని వదిలిపెట్టి కనీసం పక్కనే ఉండే తాడికొండ నియోజకవర్గంలో కూడా ప్రచారం చేయలేకపోయారు. అంతటి ఘనుడు తెలంగాణాలో జరుగుతున్న ఉపఎన్నికలో ప్రచారానికి రాకపోవటంపై పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. నిజానికి లోకేష్ ప్రచారానికి రాకపోవటమే మంచిదని అనుకునే నేతలు కూడా ఉన్నారు లేండి.

 

ఏదేమైనా ఏదో ఊడపొడిచేస్తామంటూ అభ్యర్ధిని పోటిలోకి దింపిన చంద్రబాబు మాత్రం తర్వాత అటువైపు చూడకపోవటమే విచిత్రంగా ఉంది. అసలే తెలంగాణాలో టిడిపి పరిస్ధితి వెంటిలేటర్ పై ఉన్న పేషంట్ లాగ తయారైందన్నది వాస్తవం. దానికితోడు ఏపిలో కూడా మొన్నటి ఎన్నికల్లో గుండు కొట్టించుకోవటంతో చంద్రబాబు మీదున్న భ్రమలు నేతలకు తొలగిపోయింది.

 

ఈ కారణంతోనే చాలామంది సీనియర్ నేతలు బిజెపిలోకో లేకపోతే కాంగ్రెస్ లోకో వెళిపోతున్నారు. ఇటువంటి సమయంలో హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో టిడిపి పోటి

చేస్తున్నదంటే పార్టీ బతికి బట్టకడుతుందా ? లేకపోతే ఎత్తిపోతుందా ? అన్న విషయంలో మిగిలిన నేతలకే కాకుండా జనాలకు కూడా క్లారిటి వచ్చే అవకాశం ఉంది. చూద్దాం చావా కిరణ్మయి ఏం చేస్తుందో


మరింత సమాచారం తెలుసుకోండి: