ఇటీవలే పశ్చిమ బెంగాల్ గవర్నర్ కొల్ కత్త లో జరిగిన దుర్గా పూజలో పాల్గొన్నారు. అయితే ఆ పూజ నాలుగు గంటల సేపు జరిగింది. అయితే ఆ తర్వాత దుర్గా పూజ ని టీవీ లో చూసిన  గవర్నర్ మాత్రం సంతృప్తిగా లేరు. ఎందుకో తెలుసా నాలుగు గంటలపాటు జరిగిన దుర్గా పూజలో ఆయన ఒక్క సెకండ్ పాటు  కూడా కనిపించలేదు అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ విషయంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోల్కతాలో ఇటీవలే జరిగిన దుర్గా పూజలో పాల్గొన్నారు పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్ దీప్ దన్కర్ . అయితే ఆ దుర్గా పూజలో ఆయనకు తీవ్ర అవమానం జరిగిందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 

 

 

 

 

 

 రాష్ట్ర ప్రథమ పౌరుడిగా గవర్నర్ హోదాలో ఉన్న తనను  ప్రధాన వేదిక దగ్గర కూర్చో పెట్టలేదని... అంతేకాకుండా నాలుగు గంటలపాటు కార్యక్రమం జరిగితే కనీసం సెకన్ పాటు   కూడా తనను  టీవీలో చూపించ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సెకండ్ పాటు కూడా టీవీలో కనిపించకపోవడం తనను తీవ్రంగా కలతకు,  ఆవేదనకు గురి చేసిందని ఆయన అన్నారు.అయితే ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో పై గవర్నర్ కి అవమానం జరిగిందని  ఆయన  తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే రాష్ట్ర ప్రథమ పౌరుడైన తనను  కనీసం ఒక్క సెకెండ్  కూడా చూపించకపోవడం తనకు తీవ్ర ఆవేదన కలిగించింది చాలా అవమానంగా ఫీల్ అయ్యానని గవర్నర్ జగ్ దీప్ దన్కర్  తెలిపారు . అయితే ఈ అవమానం తన ఒక్కడికే జరిగిన అవమానం కాదని... యావత్ బెంగాల్ రాష్ట్ర ప్రజలందరికీ జరిగిన అవమానం అని గవర్నర్ తెలిపారు. ఇలాంటి అవమానాలు జరిగితే బెంగాల్ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ జీర్ణించుకోలేరు అని గవర్నర్ వ్యాఖ్యానించారు. 

 

 

 

 

 గాయపడిన హృదయంతో చెబుతున్నాను ఇలాంటి ఘటనలతో  రాజ్యాంగ విధులు నిర్వర్తించకుండా తనను  అడ్డుకోలేరని గవర్నర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రథమ పౌరుడైన తనకు ... టీవీ లో ఒక్క క్షణం కూడా చూపించకపోవడం దారుణం అని... ఇలాంటి ఘటన ఎక్కడ జరిగి ఉండదేమో అని అన్నారు గవర్నర్. కార్యక్రమంలో నాలుగు గంటలపాటు కూర్చున్నప్పటికీ కూడా  మీడియా తనను  ఒక్క సెకండ్ కూడా చూపించకపోవడం అవమానంగా అనిపించింది అని గవర్నర్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: