ప్రస్తుతం దేశ రాజకీయాలు చూపు  మొత్తం మహారాష్ట్ర హర్యానా ఎన్నికల వైపే ఉంది  . ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి . ఓటర్లను ఆకట్టుకునేందుకు మహా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక బెల్లం చుట్టూ ఈగలు వాలినట్లు... ఎన్నికలు వచ్చేసరికి నాయకులందరూ ప్రజల్లోనే ఉంటున్నారు. ప్రజలను ఆకర్షించేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో ఎవరికి వారు గెలుపుపై ధీమా తో ఉన్నారు. కాగా  మహారాష్ట్ర లో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 8.94  కోట్ల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే ఈ నెల 21న ఎన్నికలు నిర్వహించనుండగా  24న ఫలితాలు వెలువడనున్నాయి. అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి  అన్ని పార్టీలు... వ్యూహాలు ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. 

 

 

 

 అయితే ఈసారి ఎలాగైనా మహారాష్ట్రలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని అనుకుంటున్న కాంగ్రెస్ తీవ్ర కసరత్తులు చేస్తోంది. గతంలో గెలిచి  కాంగ్రెస్ కి షాకించింది.  అయితే ఇప్పటికే గతంలో అధికారంలో ఉన్న బిజెపి తాము చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరిస్తూ ప్రజలు లోకి దూసుకెళ్లి పోతుంది. అయితే తాజాగా బిజెపి ఎన్నికల  మేనిఫెస్టో ను కూడా విడుదల చేసింది.  ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యంగా విద్యా,  వైద్యం, మౌలిక వసతులు తదితర అంశాలు ఉన్నాయి.అయితే తాజాగా మహారాష్ట్ర ఎన్నికలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపు ఎట్టిపరిస్థితిలో బీజేపీదే అని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్. 

 

 

 

 గత పదిహేనేళ్ల యూపీఏ పాలనలో మహారాష్ట్రలో జరగని అభివృద్ధి... ఐదేళ్లలో అన్ని రంగాల్లో ప్రగతి సాధించి బీజేపీ అబివృద్ది చేసిందని తెలిపారు. బిజెపి ప్రభుత్వ హయాంలో మహారాష్ట్రలో అభివృద్ధి శరవేగంగా జరిగిందని చెప్పారు. అయితే గత ప్రభుత్వాలు మహా రాష్ట్ర అభివృద్ధి కోసం ఏడాదికి కేవలం 1.22 లక్షల కోట్లు మాత్రమే కేటాయిస్తే.. బిజెపి మ 4.78  కోట్ల కంటే ఎక్కువే ఇచ్చామన్నారు. అయితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పడ్నవీస్ కి  వివాద రహితుడు అన్న పేరు ఉండడం కూడా బిజెపికి కలిసొచ్చే అంశమని అన్నారు. ఫడ్నవీస్ పై ఒక్క అవినీతి మరక కూడా లేదని.. 5 ఏళ్లలో పడ్నవీస్  పారదర్శక పాలన చేశారని అన్నారు. ఈసారి ఎలాగైనా తమదే అధికారం అని ధీమా వ్యక్తం చేసిన అమిత్ షా ... గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శివసేన మద్దతు కోరినప్పటికీ ఈసారి మాత్రం... ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని  ధీమా వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: