తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజు రోజుకు ఉధృతంగా మారుతోంది.  రోజురోజుకి మద్దతు కూడగట్టుకొని ఉగ్రరూపం దాలుస్తుంది సమ్మె . అయితే తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మొదలై 13వ రోజుకు చేరుకున్నప్పటికీ...  ఇప్పుడు వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులు డిమాండ్లపై  పరిష్కారం దిశగా  నిర్ణయం తీసుకోలేదు. అంతేకాకుండా 50 వేల మంది ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ నుంచి తొలగిస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన గడువు లోపు ఆర్టీసీ వీధుల్లో చేరని  కార్మికులు ఉద్యోగుల నుంచి తొలగించినట్లు  తేల్చిచెప్పింది తెలంగాణ ప్రభుత్వం. 

 

 

 

 ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు సహా ఆర్టీసీ కార్మికుల పట్ల కెసిఆర్ మొండి వైఖరితో ఆర్టీసీ సమ్మె  రోజురోజుకు ఉధృతంగా మారుతోంది. ఇప్పటికే బిజెపి కాంగ్రెస్ సిపిఐ సిపిఎం సహా అన్ని పార్టీలు ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలుపుతున్నాయి . ఉద్యోగ సంఘాలు కూడా తాజాగా ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలిపాయి. ఇక తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా తాజాగా ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలుపుతున్నారు . అయితే  రోజురోజుకి సమ్మె ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తుంది. 

 

 

 

 అయితే ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలుపుతున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో  ప్రగతి భవన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు ఓయూ నుంచి ప్రగతి భవన్ కు బయల్దేరిన  విద్యార్థి  సంఘాలు... ఆర్టిసి సమ్మె  కి మద్దతుగా రాలి నిర్వహిస్తున్నామని తెలిపారు.  ఈ నేపథ్యంలో ఎన్సిసి గేటు వద్ద విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . దీంతో పోలీసులకు అటు విద్యార్థులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది తోపులాట కూడా జరిగింది. దీంతో ప్రభుత్వ తీరుకు నిరసనగా నినాదాలు చేసారు ఓయూ విద్యార్థులు.  ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను తీర్చాలని విద్యార్థి నేతలు విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: