ఈనెల 21న జరిగే హుజూర్నగర్ ఎన్నికలపైనే రాష్ట్ర రాజకీయాల చూపు  మొత్తం ఉంది. అన్ని పార్టీలు హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో గెలుపు ని ప్రతిష్టాత్మకంగా తీసుకోగా ... ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై అందరికీ ఆసక్తి నెలకొంది. అయితే ఎన్నికలు మొదలవ్వక  ముందు నుంచే విజయం  కోసం ప్రణాళికలు రచిస్తున్నాయి అన్ని పార్టీలు. కేంద్ర ఎన్నికల సంఘం హుజూర్నగర్ ఉప ఎన్నికల తేదీని ఖరారు చేసిన తర్వాత... హుజూర్నగర్ పోరు ఊపందుకుంది. ఎవరికివారు గెలుపు కోసం పావులు కదుపుతున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన టిఆర్ఎస్ ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది... గత ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ ఈసారి కూడా విజయాన్ని నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతోంది ... ఇక బిజెపి అయితే మరోసారి తన విజయాన్ని నమోదు చేసి అందరికీ షాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తుంది . ఎవరికి వారు గెలుపుపై ధీమాతో ఉన్నారు. 


 అయితే కాంగ్రెస్ టిఆర్ఎస్ బిజెపి అభ్యర్థులు ప్రచార  రంగంలో దూసుకుపోతుండగా...  ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. ఎందుకంటే ఎప్పుడు ఒంటరిగానే బరిలోకి దిగిన టీఆర్ఎస్ మొదటిసారి విజయంపై కాస్త అపనమ్మకంతో ఉంది. దీంతో సాంప్రదాయ ఓటింగ్ ఉన్న సిపీఐ ని మద్దతు కోరింది . తెరాస కి మద్దతిచ్చిన సిపిఐ తర్వాత ఆర్టీసీ సమ్మె తెరమీదకు రావడంతో తెరాసకి  ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకుంది సిపిఐ. ఇదే కాకుండా ఆర్టీసీ సమ్మె పై కెసిఆర్ వ్యవహరిస్తున్న తీరు కూడా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ పై ప్రభావం చూపుతుందని  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు . 



 ఇదిలా ఉండగా టీజేఎస్  అధ్యక్షుడు కోదండరాం హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారం లో కాంగ్రెస్ తరఫున ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో ఎల్లాపురం లో కాంగ్రెస్ అభ్యర్థి  పద్మవతి తరపున ప్రచారంలో పాల్గొన్న కోదండరాం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. హుజూర్నగర్ లో పద్మావతి గెలుపు ఎంతో అవసరమన్నా కోదండరాం ... ఒకవేళ హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే ఇక కేసీఆర్ ఎవరి మాట వినరని   అన్నారు. అయితే హుజూర్ నగర్  ఉప ఎన్నికల్లో గెలిచేందుకు టిఆర్ఎస్ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని... కానీ గెలిచిన తర్వాత మాత్రం ప్రజలను పట్టించుకోదన్నారు. కాంగ్రెస్ గెలిస్తే ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కూడా అసెంబ్లీలో పోరాటం చేస్తారని కోదండరామ్ అన్నారు. అయితే ఈ ఒక్క సీటు గెలవటం  వల్ల టిఆర్ఎస్ కు వచ్చేది ఏమిలేదని... కానీ కాంగ్రెస్ గెలిస్తే అసెంబ్లీలో ప్రజల తరపున పోరాడే ఒక వ్యక్తి  ఉంటారని కోదండరాం తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: