తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె రోజు  రోజుకు ఉధృతమవుతోంది. కాగా ఈ నెల 5న మొదలుపెట్టిన సమ్మె నేటితో 14 వ రోజుకు చేరుకుంది. అయితే ఆర్టీసీ సమ్మె 14 రోజులకు  చేరుకున్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల  పరిష్కారంపై మొండిపట్టు విడడంలేదు. సమ్మె చేస్తున్న 50 వేల మంది ఆర్టీసీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించడమే  కాకుండా కార్మికులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసారు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు . కాగా ఆర్టీసీ కార్మికుల రోజుకో విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఈ నిరసనల్లో భాగంగా రేపు తెలంగాణ బంద్ నిర్వహించనున్నారు . కాగా ఆర్టీసి సమ్మె కు  రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. 

 

 

 

 

 అయితే ఇప్పటికే కోర్టు ఇరువర్గాలకు మొట్టికాయలు వేసి  సమస్యల  పరిష్కారానికి ఆత్మహత్యలు సమాధానం  కాదని ఇరువర్గాలు ముందుకు వచ్చి చర్చలు జరిపితేనే  సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపింది.  కాగా గతంలో జరిగిన విచారణలో కూడా  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కుదరదని కోర్టుకు తెలిపింది ప్రభుత్వం. అయితే ఆర్టీసీకి కొత్త ఎండీ ని నియమించాలని  హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.తాజా విచారణలో ఈ విషయంలో ప్రభుత్వం పై సీరియస్ అయింది కోర్టు.   నేడు  ఆర్టీసీ సమ్మె పై విచారణ చేపట్టిన కోర్టు అటు ప్రభుత్వం ఇటు కార్మికుల వాదన విన్న తర్వాత ఆర్టీసీ సంస్థ కు ఎందుకు ఎండీ ని  నియమించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆర్టీసీకి ఎండీ ని  నియమించి  ఉంటే కార్మికులకు భరోసా ఉండేదని తెలిపింది  కోర్టు. అంతేకాకుండా 14 రోజుల నుండి ఆర్టీసీ కార్మికుల సమ్మె చేపడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని   ప్రశ్నించింది. సమ్మెకు ఇప్పటికే రోజురోజుకి మద్దతు పెరుగుతోంది అని సమ్మె ఉధృతం అయితే రాష్ట్రంలో పరిస్థితులు చేయి దాటి పోతాయని ప్రభుత్వానిపై  సీరియస్ అయింది  కోర్టు.

 

 

 

 

 అయితే ఇప్పటికే సమర్థవంతుడైన ఇంచార్జ్ ఆర్టి సి సంస్థకు  ఉన్నారని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు సూచించగా....సమర్థవంతుడైన వ్యక్తి  అయితే అతని ఎండీ గా  ఎందుకు నియమించలేదని ప్రశ్నించింది  కోర్టు. ప్రజాస్వామ్యంలో ప్రజలను   ఎవరు ఆపలేరని , ప్రజలు తిరగబడితే ఏం చేయలేమని   తెలిపింది కోర్టు.  ఆర్టీసీ ఆర్థిక స్థితిగతుల వలనే ఎండీ ని  నియమించలేదని... అయితే ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టుకు చెప్పినప్పటికీ ప్రభుత్వం వారి వాదనలు తో సంతృప్తి చెందలేదు.ఇదిలా ఉంటే రేపు  కార్మికులు తెలంగాణ బంద్  నిర్వహిస్తుండగా రేపట్నుంచి ట్యాక్సీ డ్రైవర్లు ఓనర్లు కూడా సమ్మె  నిర్వహించడం గమనార్హం అయితే ఇప్పటికే ఆర్టీసీ సమ్మెతో తీవ్ర ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు...టాక్సీ డ్రైవర్ల జేఏసీ కూడా  సమ్మె చేపడితే  పూర్తిగా రవాణా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు  ఎదుర్కొనే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: