చంద్రబాబునాయుడు పరిస్ధితి చాలా విచిత్రంగా తయారైనట్లే కనిపిస్తోంది. ఒకవైపు జగన్ ను విమర్శిస్తునే మరోవైపు పార్టీ పటిష్టతకు జగన్ ఫార్ములానే కాపీ కొడుతున్నారు. మొన్ననే జరిగిన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఈ విషయాన్నే నిర్ధారిస్తోంది.

 

సంస్దాగతంగా పార్టీ బలహీనంగా ఉందని అంగీకరిస్తూనే బలోపేతం చేయటానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయమై సమావేశం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాలేమిటంటే పార్టీ పదవుల్లో మూడోవంతు యువతకు కేటాయించాలన్నది కీలకం. మరో మూడోవంతు మహిళలకు కేటాయించాలని డిసైడ్ చేసింది. మొత్తం మీద  యువత, మహిళలు, బడుగు, బలహీన వర్గాలకు పార్టీలో పదవులు కేటాయించాలన్నది కీలకం.

 

అదే సమయంలో పార్టీని నమ్ముకున్న వారికే పెద్ద పీట వేయాలని కూడా సమావేశం డిసైడ్ చేసింది. ఎందుకంటే పదవులను నమ్ముకున్న వారు మధ్యలోనే వెళిపోతారట. పార్టీ జెండాను నమ్ముకున్న వారు మాత్రం పార్టీలోనే శాస్వతంగా ఉండిపోతారని చంద్రబాబుకు 40 ఏళ్ళ తర్వాత  జ్ఞానోదయం అయ్యింది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పార్టీలో అసలు సమస్యే చంద్రబాబు. ఎలాగంటే పార్టీని నమ్ముకున్న వాళ్ళల్లో చాలామందిని బయటకు వెళ్ళిపోయేట్లు చేసిందే చంద్రబాబు. సుజనా చౌదరి, సిఎం రమేష్, నారాయణ లాంటి వ్యాపారస్తులను రెడ్ కార్పెట్ వేసి నెత్తిన పెట్టుకున్నదే చంద్రబాబు. ఎప్పుడైతే వీళ్ళకు చంద్రబాబు బాగా వెయిట్ ఇవ్వటం మొదలుపెట్టారో వెంటనే వీళ్ళు వివిధ జిల్లాల్లోని నేతల మీద సవారీ చేయటం మొదలుపెట్టారు.

  

నిజానికి వీళ్ళల్లో ఎవరు కూడా రాజకీయనేతలు కాదు. దశాబ్దాలుగా రాజకీయాల్లోనే ఉన్న వాళ్ళని కాదని ఏదో డబ్బుందన్న కారణంతో వ్యాపారస్తులకు ప్రాధాన్యత ఇవ్వటంతోనే పార్టీలో సమస్యలు మొదలయ్యాయి. అందుకే పదవుల కోసం వచ్చిన వాళ్ళు పార్టీ ఓటమితో బయటకు వెళ్ళిపోతున్నారు. అదే సమయంలో దశాబ్దాలుగా పార్టీలోనే ఉన్నా సరైన గుర్తింపు లేదన్న కారణంతో పార్టీ మద్దతుదారులూ వెళిపోతున్నారు. అందుకనే వేరే దారిలేక పార్టీ బలోపేతానికి చంద్రబాబు చివరకు జగన్ ఫార్ములానే ఫాలో అవ్వాల్సొస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: