అమెరికాలో సెటిల‌వ్వాలి అనుకునే వాళ్ల‌కు అదిరిపోయే ఆఫ‌ర్‌. అగ్ర‌రాజ్యంలో ఉద్యోగం కోస‌మే ఎంతో క‌ష్ట‌ప‌డుతుంటే...అక్క‌డ నివాసం ఉండే అవ‌కాశం ఉందంటే..చెప్ప‌కుండా ఉంటారా?  వెంట‌నే చెప్పేయండి అంటారా?  త‌ప్ప‌కుండా చెప్తాం. అయితే... తెలుసుకోండి. జాగ్ర‌త్త ప‌డండి. మోస‌పోకండి. అనే మాట‌లు కూడా చెప్తాం!! ఇంత‌కీ విష‌యం చెప్ప‌రేంటి అంటారా...వ‌చ్చేస్తున్నాం అక్క‌డికే.


``అమెరికా వెళ్లాల‌న్నది నా ఆశ‌యం. అందుకు డ‌బ్బులు. ఆ ల‌క్ష్యంతో వ్య‌వ‌సాయ భూమిని, బంగారాన్ని అమ్మేశాను. నిబంద‌న‌ల ప్ర‌కారం వెళ్లేందుకు అవ‌కాశం లేక‌పోవ‌డంతో..ఓ ఏజెంట్‌ను క‌లిశాను. సుమారు 18 ల‌క్ష‌ల డ‌బ్బును ఏజెంట్‌కు క‌ట్టాను. అనంత‌రం  మా ఏజెంట్ మెక్సికో ద్వారా అడ‌వుల నుంచి అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేశాడు. సుమారు రెండు వారాల పాటు అడ‌వుల్లో న‌డిచాం. కానీ...మా దుర‌దృష్టం...మెక్సికో అధికారుల త‌నిఖీల్లో దొరికిపోయారు. మెక్సికో నుంచి నాతో పాటు చాలామందిని తిరిగి పంపించారు`` ఈ మాట‌లు చెప్పింది ఎవ‌రో తెలుసా? అమెరికాలోకి అక్ర‌మంగా ప్ర‌వేశించేందుకు చాలా మంది విదేశీయులు మెక్సికో బోర్డ‌ర్ ద్వారా వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు. అలా మెక్సికో ద్వారా అమెరికాలోకి అక్ర‌మంగా చొర‌బ‌డాల‌ని ప్ర‌య‌త్నించిన 311 మంది భార‌తీయుల‌లో ఒక‌డైన  గౌర‌వ్ కుమార్ అనే భార‌తీయుడు ఢిల్లీ చేరుకున్న త‌ర్వాత మీడియాతో మాట్లాడుతూ....ఈ విధంగా త‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గౌర‌వ్‌తో పాటు వ‌చ్చిన‌వారిలో చాలా మందికి క‌నీసం ల‌గేజీ కూడా లేక‌పోవ‌డం శోచ‌నీయం.


కాగా, అక్ర‌మ వ‌ల‌స‌ల విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్న అమెరికా భార‌తీయుల‌ను వెన‌క్కి పంపిన ఘ‌ట‌న ప‌ట్ల స్పందించింది. మెక్సికోలో ఉండేందుకు డాక్యుమెంట్లు లేని కార‌ణంగానే భారతీయుల‌ను వెన‌క్కి పంపిన‌ట్లు అధికారులు తెలిపారు. మాన‌వ అక్ర‌మ ర‌వాణాను ఎట్టి ప‌రిస్థితుల్లో స‌హించేది లేద‌ని యూఎస్ క‌స్ట‌మ్స్ అధికారి మోర్గ‌న్ చెప్పారు. కాగా, కేవ‌లం భార‌తీయులే కాకుండా శ్రీలంక‌, నేపాల్‌, కెమ‌రూన్ నుంచి వ‌చ్చిన‌వారు సైతం ఇలా అధికారుల‌కు దొరికిపోయి....స్వ‌దేశానికి తిరిగివెళ్లారు.


మరింత సమాచారం తెలుసుకోండి: