ఎందరో ప్రాణాలు అర్పించారు. మరెందరో వెలకట్టలేని త్యాగాలు చేసారు. గాంధీజి చేసిన పోరాటం మనం చూడలే కాని తెలంగాణకోసం చేసిన పోరాటం కళ్ళముందు జరిగింది. ఈ పోరాటంలో పాల్గొనని వారు లేరు. తెలంగాణ వస్తే బ్రతుకులు బాగుపడతాయాని చిన్న ఆశతో ఎందరో ఆడబిడ్డలు తమ తాళిబొట్లను సైతం త్యాగం చేసారు. ఒక్కరి పోరాటంతో తెలంగాణ రాలేదు. కోట్లగొంతుకలు ఫిరంగుల్లా మోగిన శబ్ధంతో, వందలకొద్ది ప్రాణాలు రక్త తర్పణాలు అర్పించిన త్యాగాలతో, తెలంగాణ కల సాకారమైంది.


కాని ఏం లాభం తెలంగాణ తెచ్చుకున్నది బ్రతుకులు బాగుచేసుకోవడానికి కాదు. పుట్టిన పిల్లాడితో పాటుగా బ్రతుకులు బానిసలుగా మార్చుకోవడానికని, అప్పులు కట్టలేక చావడానికని ఎందరో ప్రజలు వేదన చెందే పరిస్దితులు ఇప్పుడు క్రమక్రమంగా ఏర్పడుతున్నాయి. రోజు రోజుకు నవ్వులపాలవుతున్న తెలంగాణాకు పట్టిన తెగులు పూర్తిగా నాశనం చేసేదాక వదిలేలా లేదంటున్నారు విద్యావేత్తలు. ఈ పరిస్దితులు ఇలాగే కొనసాగితే ప్రజల బ్రతుకులు నిజాం పాలకుల చేతిలో కీలుబొమ్మల్లా మారినట్లుగా ఇప్పుడు మళ్లీ ఆ దుస్దితిని ఎదుర్కొన వలసి వస్తుంది. దీనివల్ల మరిన్ని కొత్త ఉద్యమాలు ఊపిరిపోసుకునే పరిస్దితి తలెత్త వచ్చనే భయం తొణికిసలాడుతుంది.


ఎందుకంటే, రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు సోమవారం తెరుచుకున్నాయి. 24 రోజుల సెలవుల తర్వాత పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కావడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. దీంతో ప్రయాణికుల తాకిడికి తగినట్టుగా బస్సులు నడపాలని ప్రభుత్వం ఆర్టీసీని ఆదేశించింది. ఈ క్రమంలో రోజువారీగా నడిపిన వాటి కంటే ఎక్కువ నడపాల్సి ఉండగా.. అధికారులు మాత్రం విఫలమయ్యారు. తక్కువ బస్సులే రోడ్డెక్కడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్‌ పరిధిలో 2 వేల బస్సులు నడపాలని ఆర్టీసీ భావించింది. అయితే, కేవలం 859 బస్సులు మాత్రమే నడపగలిగారు. అవి కూడా సమయానుకూలంగా నడవలేదు.


ఫలితంగా విద్యార్ధులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. ఇదే గాకుండా ఇన్ని రోజుల సమ్మెతో అసలు తెలంగాణాలో ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్దితిలో ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం, ఆర్టీసి కార్మికులవల్ల తెలంగాణ ఆర్దిక పరిస్దితిలో వచ్చే మార్పులకు బాధ్యత వహించే వారెవ్వరంటు కొందరు యువకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడున్న సమస్య ఒక ఆర్టీసీ వారిదే కాదు, కోట్లమంది విద్యార్ధుల భవిష్యత్తు, తెలంగాణ ప్రజల బ్రతుకులు. ఇవన్ని కూడా ప్రస్తుతం ఈ సమ్మెవల్ల ప్రభావితం కానున్నాయి. పలు సమస్యలకు కేంద్రబిందువులా మారనున్నాయి. కంటికి కనిపించని చీడ పంటను నాశనం చేసినట్లుగా ఇప్పుడున్న సమస్య ముందుముందు ప్రజలను తప్పక కన్నీళ్ల పాలు చేస్తుందని చెప్పకనే చెబుతున్నారు కొందరు పరిశీలకులు. ఇది తెలంగాణాలో ప్రతి వ్యక్తి ఆవేదన అని అనుకొంటున్నారట కొందరు ! 


మరింత సమాచారం తెలుసుకోండి: