అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతూ... పొరుగు రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుని  రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలే  కాకుండా ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తున్నారు  ముఖ్యమంత్రి జగన్ . ప్రజలకు సుపరిపాలన అందించే కీలక నిర్ణయాలు  తీసుకుంటున్నారు. ఇప్పటికే  కంటి వెలుగు,  రైతు భరోసా, ఆటో డ్రైవర్లకు చేయూత  వంటి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 



 ఇప్పుడు తాజాగా నిరుద్యోగుల  కోసం మరో పథకం ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి . నిరుద్యోగులకు చేయూతనివ్వాలనే  ఉద్దేశంతో... వైయస్సార్ ఆదర్శం అనే పథకానికి శ్రీకారం చుట్టనున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు వాహనాలు అందించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు కార్పొరేషన్ ల  ద్వారా నిరుద్యోగులందరికి  వైయస్సార్ ఆదర్శం పథకం ద్వారా నిరుద్యోగులకు వాహనాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. బ్యాంకు రుణాల ద్వారా యువతకు వాహనాలు  మంజూరు చేయనుంది. అయితే ఇప్పటికే కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాలో ఏడుగురు సభ్యులతో కలిసి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఆయా జిల్లాల్లో పర్యటించిన వివరాలు సేకరించి నివేదికను అందజేయనున్నారు. 



 కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా నాయకుడైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే  కాకుండా ఇవ్వని హామీలను కూడా ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్నారు ఆయన. రాష్ట్రంలో అవినీతి రహిత పారదర్శక పాలన అందిస్తూ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.


మరింత సమాచారం తెలుసుకోండి: