ఎప్ప‌ట్లాగే...ఊహించిన రీతిలోనే...త‌మ‌పై ఎల్లో మీడియా...మ‌రోమారు దుష్ప్ర‌చారం చేసింద‌ని వైయస్సార్‌సీపీ  వ‌ర్గాలు మండిప‌డుతున్నాయి. ఈ ద‌ఫా పార్టీపై కాకుండా కేంద్రహోంమంత్రి అమిత్‌ షాతో  ఏపీ సీఎం జగన్‌ సమావేశంపై విషం చిమ్మార‌ని విశ్లేషిస్తున్నాయి.  దాదాపు 45 నిమిషాల పాటు ఈ ఇద్ద‌రు నేత‌ల  మ‌ధ్య‌ సమావేశం కొనసాగితే...దానిలో లేని విష‌యాల‌ను ప్ర‌స్తావిస్తూ...జ‌గ‌న్ ప్ర‌భ‌ను త‌గ్గించేలా ఎల్లో మీడియా ఏడుపులు, పెడ‌బెబ్బ‌లు పెడుతోంద‌ని ఆరోపిస్తున్నారు.


ఏపీ ముఖ్య‌మంత్రి కార్యాల‌యం ప్ర‌క‌ట‌న ప్ర‌కారం, ఏపీ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సీఎం వైఎస్‌ జగన్‌, అమిత్‌‌షాతో చర్చించారు. రాష్ట్ర విభజన పరిశ్రమలు , సేవా రంగాలపై ప్రతికూల ప్రభావం చూపిందని తెలిపారు. ఆదాయంలో ఈ రంగాల వాటా 76.2 శాతం నుంచి 68.2 శాతానికి తగ్గిందన్నారు. ప్రత్యేక హోదా ద్వారానే ఈ సమస్యలను అధిగమించగలమని అమిత్‌ షాకి సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని మరోసారి అమిత్‌‌షాకు సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా, రెవెన్యూలోటు కింద రావాల్సిన నిధులు, పోలవరం అంచనాలకు ఆమోదం, విభజన చట్టంలోని హామీలు, వెనకబడ్డ జిల్లాలకు నిధులు, నాగార్జునసాగర్‌, శ్రీశైలంలకు గోదావరి వరదజలాల తరలింపుపై సీఎం వైఎస్‌ జగన్‌ అమిత్‌ షాతో చర్చించారు. 


అయితే, అమిత్‌షా త‌న‌తో జ‌గ‌న్‌ స‌మావేశం అవడంపై పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌లేద‌ని...పైగా త‌క్కువ స‌మ‌యం కేటాయించార‌ని ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై వైయస్సార్‌సీపీ వ‌ర్గాలు వివ‌ర‌ణ ఇచ్చాయి.ఢిల్లీలో సీఎం పర్యటనపై వస్తున్న వదంతులను వైయస్సార్‌సీపీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. ఇలాంటి ప్రచారాలు కొత్తవి కాదన్న వైయస్సార్‌సీపీ వర్గాలు వ్యతిరేక ప్రచారం మాటన పబ్బంగడుపుకోవాలన్నది టీడీపీ, దాని అనుకూల మీడియా ఆరాటమ‌ని పేర్కొన్నాయి. అత్యంత సుహృద్భావ వాతావరణంలో అమిత్‌షాతో వైయస్ జగన్‌ సమావేశం జ‌రిగింద‌ని తెలిపాయి. రాజకీయాలకు అతీతంగా ఏపీ సమస్యలపై చర్చ జరిగిందని స్ప‌ష్టం చేశాయి. తన పుట్టినరోజు వేళ తీరికలేకున్నా... వైయస్ జగన్‌తో సుమారు 45 నిమిషాలు మాట్లాడారని వివ‌రించాయి. ఏపీ సమస్యలపై తాను ఇతర శాఖల మంత్రులతో మాట్లాడతానని అమిత్‌షా అన్నారని వైయస్సార్‌సీపీ వర్గాలు స్ప‌ష్టం చేశాయి. అమిత్‌షా హామీతోనే ఇతర మంత్రులతో భేటీలు వాయిదాపడ్డాయని తెలిపాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: