కొందరు ఉన్నత చదువులు చదువుకుని, పరిజ్ఞానాన్ని సంపాదించుకుని, అజ్ఞానంగా జీవించడానికి అలవాటు పడతారు. నేర్చుకున్న చదువును, జ్ఞానాన్ని అడ్డదారుల్లో అడ్డమైన పనులకు వాడుతుంటారు. ఇలా చేయడం వల్ల ఉన్నతెలివికి, పెంపొందించుకున్న జ్ఞానానికి అసలు అర్ధమే లేకుండా పోతుందని గ్రహించరు. అంతే కాకుండా మితిమీరిన తెలివి తేటలను అమాయకులైన వారిపై ప్రయోగిస్తూ, జల్సాలకు అలవాటుపడి మోసాలు చేస్తూ బ్రతుకుతారు. జీవితాన్ని ఉన్నతంగా మలుచుకోవడం చేతగాక నేరస్దుల్లా మారుతారు. ఇలా మంచి చదువులు చదివిన విద్యావంతుడు డబ్బుకోసం అడ్డదార్లు తొక్కి ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నాడు. పూర్తి వివరాలు పరిశీలిస్తే..


తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలానికి చెందిన శ్రీనివాసరావు, ఎంటెక్ చదివాడు. చదివిన చదువును గంగపాలు చేసి, సులువుగా డబ్బు సంపాదించడం కోసం అడ్డదారులు తొక్కాడు. గత కొంతకాలంగా 12 జిల్లాల పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న ఘరానా మోసగాడు శ్రీనివాసరావు ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్ లో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిదగ్గర ఉన్న 12 మొబైల్ ఫోన్లు, 29 సిమ్ కార్డులు, ఒక ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇతని మోసాల చిట్టా బయటకు తీస్తే, పత్రికల్లో ఉద్యోగాలు, రుణాల పేరిట ప్రకటనలు ఇచ్చి అమాయకులను మోసగించడంలో శ్రీనివాసరావు దిట్ట.


ఇలా  150 మంది నుంచి భారీ మొత్తంలో వసూలు చేసినట్టు శ్రీనివాసరావు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇకపోతే అతడిపై ఇప్పటివరకు 20 కేసులున్నాయి. సాధారణ పోలీసులతో పాటు సీఐడీ, సైబర్ క్రైమ్ పోలీసులు కూడా కొంతకాలంగా శ్రీనివాసరావు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇతని ఆచూకి తెలుసుకోవడం కోసం 600 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ను జల్లెడ పట్టి పక్కాగా స్కెచ్ వేసి అతడిని పట్టుకున్నారు. ఇక ఇతను మ్యాట్రిమొనీ సైట్ తో మోసగించిన కేసులో కూడా గతంలో అరెస్ట్ అయ్యాడు...   


మరింత సమాచారం తెలుసుకోండి: