తెలుగుదేశం పార్టీ అధినేత మరియు ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గత కొన్నాళ్లుగా జగన్ విషయంలో కొంచెం హద్దులు మీరి మాట్లాడుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచార పర్వం నుంచి ఈ కథ నడుస్తూనే ఉంది. ఒకానొక సమయంలో "చెడ పుట్టాడు..." అంటూ జగన్ విషయంలో బాబు మాట్లాడిన తీరు అందరినీ విస్మయపరిచింది. ఇప్పుడు ఇదే విషయమై చంద్రబాబుకి ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అతని భాషను మార్చుకోమని సూచించారు.

ముఖ్య మంత్రిని పట్టుకొని "వాడు... వీడు..." అని సంబోధించడం అసలు సమంజసం కాదని శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించాడు. అంతేకాకుండా ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయాక చంద్రబాబునాయుడు మరింత అసహనంగా ఇష్టానుసారం మాట్లాడుతూ... "జగన్ చేతిలో అధికారం పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది. దాంతో అతడు తనను తనను తాను కొట్టుకుంటాడు లేక ఎవరైనా కొడతాడు" అన్న విషయం కూడా తెలిసిందే. చంద్రబాబు నాయుడు తన భాషని మార్చుకోవాలని... అలాగే జగన్ విషయంలోనే కాకుండా చంద్రబాబు నాయుడు తనకు నచ్చిన వ్యవహారాలపై తీవ్రమైన సహనంతో స్పందిస్తున్నారని అసలు ఏం మాట్లాడుతున్నాడో తనకే అర్థం కావట్లేదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

ఇకపోతే ఎన్నికల సమయంలో అడిగేవారు లేరు అని ప్రధాని మోడీని బాబు ఎన్ని మాటలు అన్నారో అందరికీ తెలిసిందే. "నేను మీ భార్య గురించి మాట్లాడితే మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు" అంటూ మోడీని ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించాడు. ఇప్పుడేమో మోడీతో తనకి అసలు ఏ విభేదాలు లేవని అంటున్నారు. కొద్ది రోజుల క్రితమే సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్ లను పట్టుకొని పచ్చి బూతులు చదివి వినిపించి చంద్రబాబు నాయుడు ఏదో బుద్దిమంతుదిలా వ్యవహరించాడు. సోషల్ మీడియా అన్న తర్వాత ఎవరో ఒకరు ఏదో ఒక చెత్త పోస్ట్ చేస్తూనే ఉంటారు. కానీ ఒక మాజీ సీఎం హోదాలో ఉండి బహిరంగంగా పచ్చి బూతులు చదివి వినిపించడం ఏమీ బాగా లేదని ఆ సమయంలో పలువురు ఆక్షేపించారు కూడా. కాబట్టి వీలైనంత త్వరగా చంద్రబాబు తన వైఖరి మార్చుకుంటే మంచిది ఉన్నట్లు అనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: