తెలంగాణలో గత 18 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. 18 రోజుల నుండి వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నప్పటికీ  ఇప్పటివరకు కేసీఆర్ మాత్రం ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పై స్పందించలేదు .అంతే  కాకుండా ఆర్టీసీ సమ్మె చేస్తున్న 50 వేల మంది ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మె పై కేసీఆర్ ప్రభుత్వం  నిరంకుశ వైఖరి అవలంబిస్తోందని ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలిపిన ప్రతిపక్షాలన్నీ ఆర్టీసీ కార్మికుల తరఫున వాళ్ల న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్నాయి. అయితే ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలై 18 వ రోజుకి  చేరుకున్నప్పటికీ కెసిఆర్ ఇంకా స్పందించకపోవడంతో ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు ఉన్నాయి. 

 

 

 

 అయితే ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ ముట్టడికి యత్నించగా  అది  పరిస్థితులకు దారి తీసింది. అయితే ఇప్పటికే ఆర్టీసీ సమ్మె పై కేసీఆర్ అవలంబిస్తున్న తీరుతో కెసిఆర్ విమర్శల పాలవుతున్నారు. అయితే హైకోర్టు కూడా కార్మికులతో చర్చలు జరపాలని చెప్పినప్పటికీ కెసిఆర్ మాత్రం ఇప్పటివరకు చర్చలు జరపలేదు. అయితే ఈ క్రమంలో సమ్మె చేస్తున్న కార్మికులందరినీ సెల్ఫ్ డిస్మిస్ కింద ఉద్యోగాల నుంచి తొలగిస్తామని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సిపిఐ నేత నారాయణ మండిపడ్డారు. 

 

 

 

 నేడు మీడియాతో మాట్లాడిన ఆయన సమ్మె చేస్తున్న కార్మికుల సెల్ఫ్ డిస్మిస్ అనేది ఏ చట్టంలో లేదని... అది కేసీఆర్ సొంత చట్టం  మాత్రమే అని సిపిఎం నేత నారాయణ విమర్శించారు. అయితే ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె చట్టవిరుద్ధం కాదని.... చట్ట ప్రకారమే నోటీసు ఇచ్చారని గుర్తు చేశారు సిపిఐ నేత నారాయణ. కాగా  నష్టాలు వచ్చే రూట్లని ఆర్టీసీ సంస్థకు అప్పచెప్పి లాభాలు వచ్చే రూట్లను  మాత్రం ప్రైవేటు వారికి కెసిఆర్ అప్పజెప్పారని  మండిపడ్డారు ఆయన. ఇక కేసీఆర్ ఆర్టీసీ సంస్థకు  ఇవ్వాల్సిన రాయితీలను చెల్లిస్తే నష్టాలు వచ్చేవి కావని అన్నారు. విడతలవారీగా ఆర్టీసీ సంస్థను ప్రైవేటుపరం చేయటానికి ముఖ్యమంత్రి కెసిఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు సిపిఐ నేత  నారాయణ. కానీ పైకి మాత్రం ఆర్టీసీని ప్రైవేటుపరం చేయమని చెబుతున్నారని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: