సంక్షేమ పథకాల అమలు కోసం వైఎస్ జగన్ సర్కార్ నడుం బిగించింది. ఈ మేరకు వివిధ పథకాల నిమిత్తం నిధుల సమీకరణకుతోడు మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఎన్నికల హామీలను నెరవేర్చే పనుల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం తలమునకలైంది.  వైఎస్‌ఆర్ రైతు భరోసా కింద 200 రిగ్గు యంత్రాల కొనుగోలుకు అనుమతించింది ఏపీ పంచాయతీరాజ్ శాఖ. ప్రతి అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గానికి ఒక రిగ్గు చొప్పున కొనుగోలు చేయాలని సూచించింది. రైతులు బోర్లు వేసుకునేందుకు ఉచితంగా రిగ్గులు ఇవ్వాలని ఆదేశించింది. ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చేందుకే రిగ్గుల కొనుగోలు చేస్తున్నట్లు ఏపీ సర్కార్ సృష్టం చేసింది.   


ఈ ఏడాది ఫిబ్రవరిలో అకాల వర్షాల వల్ల అనంతపురం లో దెబ్బతిన్న పంటలకు ఇన్ పుట్ సబ్సిడీని విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫోని తుపాను మూలంగా 33శాతానికి పైబడి దెబ్బతిన్న ఉద్యాన పంటలకు ఈ ఇన్ పుట్ సబ్సిడీ  వర్తిస్తుంది. ఇంటింటికీ తాగునీరు అందించే ఏపీ వాటర్ గ్రిడ్ పథకం నిధుల సమీకరణకు అనుమతిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రటరీ  గోపాల కృష్ణ ద్వివేది ఉత్తర్వులు వెలువరించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, నాబార్డ్, ప్రభుత్వ వాటా, బయటి సంస్థల నుండి అప్పులు, పి.పి.పి మోడ్, తదితర విధానాల ద్వారా నిధులు సేకరించాలని జీవో లో పేర్కొంది ప్రభుత్వం. 


నిరుద్యోగ యువ‌త‌కు వైయ‌స్ఆర్ ఆద‌ర్శం పేరుతో వివిధ కార్పోరేష‌న్ ల ద్వారా 6వేల వాహ‌నాలు కోనుగోలుకు మార్గద‌ర్శకాలు విడుద‌ల చేసింది  జ‌గ‌న్ ప్రభుత్వం. వివిధ బ్యాంకుల రుణాల ద్వారా నిరుద్యోగ యువ‌త కు వాహ‌నాల‌ను అందించనుంది ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ, కాపు, బిసి, మైనార్టీ, కార్పోరేష‌న్ల ద్వారా ఈ వాహనాలు అంద‌జేయ‌నుంది. సాంఘిక సంక్షేమ శాఖ కార్యద‌ర్శి నేతృత్వంలో 8 మంది స‌భ్యుల‌తో రాష్ట్ర స్థాయి క‌మిటి ఏర్పాటు చేసింది. జిల్లాల్లో క‌లెక్టర్ల ఆధ్వర్యంలో ఏడుగురు స‌భ్యుల‌తో క‌మిటీ.. అర్హులను ఎంపిక చేయనుంది. రుణాలు మంజూరు వ్యవ‌హారాలు ప‌ర్యవేక్షించ‌నున్నాయి ఈ క‌మిటీలు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: