ముఖ్యమంత్రి జగన్ని ఏ విధంగానూ ఎదగనీయకూడదన్నది టీడీపీ, దాని ఎల్లో మీడియాకు బాగా  ఉంది. అందుకే అమిత్ షాతో జగన్ భేటీ రద్దు అంటే చంకలు గుద్దుకున్నాయి దానికి తగినట్లే జగన్ కి కూడా షాతో భేటీ వాయిదా పడుతూ వచ్చింది. దీని మీద టీడీపీ తోక పత్రిక ఒకటి ఏం రాసుకొచ్చిందంటే జగన్ తో అమిత్ షా భేటీ అవడానికి ఇష్టపడడం లేదని.


కానీ జరిగింది వేరుగా ఉంది. అమిత్ షా ఎన్ని పనులు ఉన్నా, తన పుట్టిన రోజు ఉన్నా కూడా జగన్ కి విశేష ప్రాధాన్యత ఇచ్చారని కధనాలు వచ్చాయి. దాదాపుగా 45 నిముషాల పాటు అమిత్ షా జగన్ భేటీ పూర్తిగా సానుకూల వాతావరణంలో జరిగిందని అంటున్నారు. ఈ భేటీలో పోలవరం రివర్స్ టెండరింగ్ విషయంలో షా చాలా ఆనందం వ్యక్తం చేశారట.


రివర్స్ టెండరింగ్ ద్వారా 840 కోట్ల పై చిలుకు మొత్తం మిగిల్చినట్లుగా  జగన్ చెప్పడంతో అభినందించిన షా ఇలాగే ముందుకు వెళ్ళండని చెప్పడం నిజంగా వైసీపీ సర్కార్ కి బూస్టప్ గానే చెప్పుకోవాలి. అదే సమయంలో జగన్ చెప్పిన సమస్యలు వినతులు కూడా స్వీకరించిన షా అభివ్రుధ్ధికి రాజకీయాలతో సంబంధం లేదని అనడం కూడా విశేషమే.


ఇక కేంద్ర మంత్రులతో తానే మాట్లాడి ఏపీ అభివ్రుధ్ధికి సహకరించేలా చూస్తానని షా అనడమూ గొప్ప పరిణామమే. ఆ తరువాత జగన్ ఆయా శాఖల మంత్రులను కలవమని చెప్పడం కూడా ఆహ్వానించదగినదే.  మొత్తం మీద షా కోసం బయట మంత్రులు, అధికార్లు ఎదురుచూసినా కూడా జగన్ కి అంత టైం ఇచ్చి మాట్లాడడం పట్ల వైసీపీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తూంటే టీడీపీ మాత్రం షాక్ తిన్నట్లైందని అంటున్నారు. ఇక ఎల్లో మీడియాకు ఈ పరిణామాలు ఎలా కనిపిస్తాయో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: