దేశంలో క్రైమ్ రేట్ రోజురోజుకు పెరిగిపోతోంది. మనుషుల ప్రాణాలు తీయడానికి వెనకాడటం లేదు సాటి మనుషులు. మానవత్వం మృగాళ్ల మారుతున్నారు .ఇక  దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు కూడా రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ఆడపిల్ల కనిపిస్తే చాలు రాక్షసుల మారిపోయి మీద పడి ప్రాణాలు తీస్తున్నారు.మరో వైపు  రోజురోజుకీ పెరుగుతున్న టెక్నాలజీని తప్పుదోవ పట్టిస్తున్నారు సైబర్ నేరగాళ్ళు . సైబర్ నేరాలకు పాల్పడుతూ అందినకాడికి దోచుకుంటున్నారు . ఇక వయసుపైబడిన వృద్దులపై  అతికిరాతకంగా దాడులు చేయడం హింసించడం లాంటి నేరాలు కూడా దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇలా వివిధ రూపాలలో దేశంలో ఒక క్రైమ్  రేటు భారీగా పెరిగి పోతుంది. అయితే తాజాగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సిఆర్బి 2017 నివేదికను వెల్లడించింది. 

 

 

 

 

 ఈ నివేదికలు దేశవ్యాప్తంగా ఏటా జరుగుతున్న నేరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టాప్ టెన్ ప్లేస్ లో నిలిచింది. ఇదిలా ఉండగా వృద్ధ తల్లిదండ్రుల పై జరుగుతున్న నేరాల్లో  ఆంధ్రప్రదేశ్ 4వ  స్థానంలో నిలవడం గమనార్హం. ఇక సైబర్ నేరాలు,  మహిళలపై అత్యాచారాలు,  ఆర్థిక మోసాలు వంటి వాటిలో... 7వ స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వృద్ధులపై దాడులు చేసి  హింసించడం కిరాతకంగా హత్యలు చేయడం లాంటివి ఎక్కువవుతున్నాయని  నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితుల పైన కూడా దాడులు పెరిగినట్లు ఎన్సిఆర్పి నివేదిక వెల్లడించింది. ఇక మానవ అక్రమ రవాణా లో కూడా మూడవ స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్. ఉపాధి కల్పిస్తానంటూ   మాయమాటలు చెప్పి మహిళల్ని కొన్ని ముఠాలు  దేశాలు దాటించి అక్రమ రవాణా  చేస్తున్నట్లు నివేదికలో వెల్లడైంది. 

 

 

 

 

 అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయని  ఎన్సిఆర్బీ  నివేదిక వెల్లడించింది. కాగా  సైబర్ నేరాలు మహిళలపై అత్యాచారాలు ఆర్థిక మోసాలు వంటివాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే ముందు బీహార్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలు  ఉన్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వెల్లడించిన నివేదికలో సైబర్ నేరాలలో  కర్ణాటక రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. గిరిజనులపై దాడులు విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 9 వ స్థానంలో నిలిచింది. మిగతా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ లో  గిరిజనులు పై దాడులు తక్కువగా ఉన్నాయని నివేదిక వెల్లడించింది. అయితే ఏపీలో  రాష్ట్రంలో వివాహేతర సంబంధం కారణంగా హత్యలు రోజురోజుకు పెరుగుతున్నాయట .2017 సంవత్సరంలో జరిగిన హత్యల్లో  179 హత్యలు  వివాహేతర సంబంధాల కారణంగా నే జరిగినట్లు ఈ నివేదికలో వెల్లడైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: