డికె శివకుమార్ కర్ణాటక కాంగ్రెస్ కీలక నేత.. మనీ ల్యాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్టు చేసిన మాజీ మంత్రి కూడా. ఇకపోతే ఢిల్లీ హైకోర్టులో శివకుమార్ కు  కాస్త ఊరట లభించింది. మనీ లాండరింగ్ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇకపోతే సెప్టెంబర్‌ 3వ తేదీన ఢిల్లీలో సుదీర్ఘ విచారణ అనంతరం ఈడీ ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇదే సందర్భంగా డికె కు షరతులను విధించింది. దేశాన్ని విడిచి వెళ్లకూడదని కండిషన్ పెట్టింది. ఈ దశలో పన్నులను ఎగ్గొట్టారని, కోట్లాది రూపాయల లావాదేవీలను అక్రమంగా నిర్వహించారని ఇడి ఆరోపిస్తోంది.


ఈ సందర్భంలో డీకే శివకుమార్‌కు ఎట్టకేలకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరైంది.ఇదివరకు ఆయన ఢిల్లీ తీహార్‌ జైల్లో కస్టడీలో ఉన్నారు. బుధవారం ఢిల్లీ హైకోర్టులో ఆయన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం షరతులతో కూడిన బెయిలును మంజూరు చేసింది. పాసుపోర్టును అప్పజెప్పడంతో పాటు రూ.25 లక్షల పూచీకత్తు సమర్పించాలని, ఈడీ విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఇక మరోవైపు, శివకుమార్ కు బెయిల్ లభించడంపై కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నారు..


ఇదివరకు  డికె శివకుమార్ అనేక మార్లు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లు కోర్టు కొట్టేసింది.  తాజాగా మరోసారి బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా, ఈ సారిమాత్రం ఆయనకు బెయిల్‌ను మంజూరు చేసింది. ఇకపోతే దాదాపు 50 రోజుల వరకు శివకుమార్ జైల్లోనే ఉన్నారు. ఇక నిన్న ఉదయం డీకే శివకుమార్‌ను కలిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆయన గురించి మాట్లాడుతూ. డీకే శివకుమార్‌ చాలా ధైర్యవంతుడని  న్యాయస్థానంపై తనకు నమ్మకం ఉందన్నారు. ఇదిలా ఉండగా ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఈడీ సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేసింది. గురువారం ఈ పిటీషన్ పై విచారణ జరగనుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: