సీనియర్‌ దౌత్యాధికారి దేవయాని ఖోబ్రాగడెను వివస్త్రను చేసి తనిఖీ చేస్తున్నట్లు సామాజిక మీడియాలో అందుబాటులో ఉన్న సీసీటీవీ దృశ్యం ఆమెకు సంబంధించినది కాదని అమెరికా స్పష్టం చేసింది. అది నకిలీ వీడియో అని పేర్కొంది. ''ఈ విధంగా నకిలీ వీడియో దృశ్యాలు ఉంచడం ప్రమాదకరం. రెచ్చగొట్టే రీతిలో సృష్టించిన కల్పితం కాక మరోటి కాదు.'' అని అమెరికా విదేశాంగ శాఖ ఉప అధికార ప్రతినిధి మేరీ హార్ఫ్‌ అన్నారు. కస్టడీలో ఉన్న ఓ మహిళను వివస్త్రను చేసి తనిఖీ చేస్తుండగా ఆమె అరుస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. దేవయాని అరెస్టు వల్ల భారత్‌-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలకు అంతరాయం కలిగిందన్న ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అభిప్రాయంతో అమెరికా ఏకీభవించింది. ''మా విదేశాంగ శాఖ మంత్రి ఒక విషయమై విచారం వ్యక్తం చేశారంటే దానర్థం.. ఏదీ జరగాల్సిన రీతిలో జరగలేదనే.'' అని మేరీ హార్ఫ్‌ అన్నారు. ఉభయదేశాల మధ్య పూర్వస్థాయిలో దృఢ సంబంధాలను పాదుకొల్పడంపై దృష్టిసారించినట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: