ఒకవైపు యూపీఏ, ఎన్టీయే కూటమిలు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమ ప్రయత్నాల్లో తాముండగా మరోవైపు ఇంకో కూటమి రెడీ అవుతోంది. కాంగ్రెస్, బీజేపీ కూటములకు వ్యతిరేకంగా ఈ కూటమి రెడీ అవుతోందట. ఇందులో మొత్తం ఉంటాయని తెలుస్తోంది. మేరకు వివిధ ప్రాంతీయ పార్టీ ల నాయకులు కూటమి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారట. అది కూడా లోక్ సభ ఎన్నికలకు ముందే ఈ కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నాలు సాగుతున్నాయట. ఈ మేరకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూటమి గురించి ప్రకటించాడు. లోక్‌సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్, బిజెపిలకు వ్యతిరేకంగా వివిధ పార్టీలు ఒక కూటమిగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నాడు. ఒకే రకమైన అభిప్రాయాలున్న అనేక పార్టీలు భవిష్యత్తులో పార్లమెంటులో ఒక కూటమిగా ఏర్పడే అవకాశం ఉంది అని చెప్పారు. ‘ఈ కూటమి ఏర్పాటు కోసం వామపక్షాల నాయకులు చొరవ తీసుకున్నారు. జనతాదళ్ (యునైటెడ్) వారికి మద్దతిస్తోంది’ అని ఆయన అన్నాడు. అయితే దీన్ని తృతీయ కూటమి లేదా నాలుగో కూటమి అని వ్యవహరించలేమని నితీశ్ అన్నాడు. అయితే ఈ కూటమి ఏ మేరకు విజయవంతం అవుతుంది అనేది ప్రశ్నార్థకమే. అసలు పార్టీలు కలిసి ఒక కూటమి గా ఏర్పడగలదా? అనేది కూడా అనుమానమే. ఒకటీ రెండు పార్టీల మధ్య పొత్తు కూడా సరిగా కొనసాగని ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో ఏకంగా ఇన్ని పార్టీలు కలసి సాంగత్యంతో కొనసాగుతాయని అంటే కచ్చితంగా అనుమానించాల్సిన విషయమే అది. ఎవరికి వారి డిమాండ్లు ఉంటాయి. ఎవరికి కోరికలు వారి కుంటాయి. మరి ఇటువంటి నేపథ్యంలో కూటమి అసలు సాధ్యపడుతుందా?

మరింత సమాచారం తెలుసుకోండి: