వినాయక చవితి వస్తుందంటే పిల్లలకు, పెద్దలకు అందరికీ అనందమే. చూడగానే ఆకట్టునే శివపార్వతుల ముద్దుల తనయుడి రూపం చూస్తే చిన్నా పెద్ద అందరికీ తన్మయత్వం కలుగుతుంది. ప్రస్తుతం వినాయక చవితి ని ఘనంగా జరుపుకోవడం అందరికీ అచారమయ్యింది. అయితే, ఈ వినాయక చవితి వేడుకలో భక్తి కంటే అడంబరాలు అధికమయ్యినట్లు చాలా మంది అవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పెద్ద పెద్ద గణేష్ విగ్రహాలు రూపొందించి వాటిని నీళ్లల్లో కలపడంతో పర్యావరణానికి చాలా హని కలుగుతుందని పర్యావరణ శాస్ర్తవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తోనూ, అనేకమైన రంగులతోనూ రూపొందించే భారీ గణేష్ విగ్రహాల నిమజ్జనంతో పర్యావరణానికి ఎంతో కీడు కలుగుతుందని వారు అంటున్నారు. కాబట్టి వినాయక చవితి రోజున మట్టి తో చేసిన గణేష్ విగ్రహాలను పూజించాలని వారు కోరుతున్నారు. పవిత్రమైన వినాయక చవితి పండగ రోజున పర్యావరణానికి కీడు చేసే పాపపు పనులు చేయవద్దని పర్యావరణ పరిరక్షణ కారులు విజ్ఝప్తి చేస్తున్నారు.  మట్టి గణపతిని సులభంగా తయారు చేసే పద్ధతిని పైన వీడియోలో స్పష్టంగా చూపారు. పిల్లలు కూడా ఈ వీడియో చూసి సులువు గా వినాయకుడ్ని తయూరు చేయగలరు. ఈ విధంగా మీ చిన్నారులను ప్రొత్సహించి తాము తయారు చేసుకున్న వినాయక విగ్రహనికి వారు పూజలు చేసే విధంగా చిన్నారులను సిద్దం చేద్దాం..!  

మరింత సమాచారం తెలుసుకోండి: