భారత దేశంలో 29 రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడటం 60 తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరడం ఒక మంచి పరిణామం. అయితే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 40 లక్షల మంది రజకులు (చాకలి) కులస్తులు ఉన్నారు వారిని ఎస్.టి.జాబితాలో చేర్చే విధంగా యావత్ రజక భవిష్యత్ కోసం విద్య, ఉద్యోగ, రాజకీయ,ఆర్థిక అభివృద్ధి కోసం పోరాటం చేయడం కోసం యువ ఉత్సాహంతో ‘తెలంగాణ రజక సత్తా’ ను ఏర్పాటు చేస్తున్నామని తెలుపుటకు సంతోషిస్తున్నాము. గతంలో అన్ని పార్టీలు రజకులను ఎస్.టి, ఎస్.సి జాబితాలలో చేర్చుతామని ఎన్నో వాగ్ధానాలు చేసి ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చడం జరిగింది. కానీ అది ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ఈ విషయంలో రజకులకు న్యాయం చేయాలని ప్రధాన పార్టీలను డిమాండ్ చేస్తున్నాము. నాటి సాయుధ పోరాటంలో దొరల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారీమణి చాకలి ఐలమ్మ, మలిదశ పోరాట ఉద్యమంలో సిరికొండ శ్రీనివాస్ (నిజామాబాద్) చాకలి నరేష్(మెదక్)ఓరుగంటి వేణు (నల్లగొండ) వరకు వందలాది మంది అమరుల స్ఫూర్తితో మేం ముందుకు నడుస్తున్నాం. మేము 10 వేల ఓట్ల నుండి 70 వేల ఓట్లు ఉన్న నియోజక వర్గాల్లో కేంద్రీకరించడం జరిగింది. అక్కడ మా యొక్క రజకుల సమస్యలు పరిష్కారం కోసం అన్ని రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చి మాకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తాం. అన్ని జాతీయ పార్టీలనేతలను కలిసి మా సమస్యలను వివరించడం జరుతుగుంది. మా యొక్క డిమాండ్లు : రజకులను తెలంగాణ రాష్ట్రంలో ఎస్.టి. జాబితాలో చేర్చాలి, తెలంగాణ రాష్టంలో రజకుల జనాభా ప్రకారం ఎం.ఎల్.ఎ., ఎం.పి. టికెట్లు కేటాయించాలి, చాకలి ఐలమ్మ విగ్రహం ట్యాంక్ బండిపై ఏర్పాటు చేస్తూ, రాష్ట్రంలో ఐలమ్మ పేరు మీద యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి, గతంలో కేటాయించిన దోబిగాట్ లకు నిధులు మరియు వాషర్ మెన్ ఫెడరేషన్, కార్పోరేషన్ విషయంలో న్యాయ విచారణ జరపాలి, రాష్ట్ర, కేంద్రంలో రజక వసతి గృహం కేటాయించాలి, డ్రైక్లినింగ్ షాపుల నిర్వహాణ బాధ్యత కేవలం రజకులకు మాత్రమే దక్కే విధంగా చూడాలి, తెలంగాణ రాష్ట్రంలో రజకుల అభివృద్ది కోసం రూ.500 కోట్లతో ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. ఈ కార్యక్రమంలో మన్నారం నాగరాజు రజక (అధ్యక్షులు) , కల్కూరి ఎల్లయ్య రజక (ప్రధాన కార్యదర్శి), తదితరుల పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: