వెన్నెలని తలపించే తన నవ్వు నాకిష్టం
నా గమ్యాన్ని చూపించే తన అడుగు నాకిష్టం
నా రూపంలా అనిపించే తన నీడ నాకిష్టం
నన్నే నాకు కొత్తగా చూపించే తన స్నేహం నాకిష్టం
నాకు భయం కలిగించే తన కోపమూ నాకిష్టం
ప్రపంచాన్ని మైమరిపించే తన ప్రేమ నాకిష్టం
కోకిలని మరపించే తన స్వరం నాకిష్టం
నన్ను అణువణువు స్థంబింపచేసే తన చూపులు నాకిష్టం
ఆన్నిటికన్నా.....
నా జీవితానికి విలువనిచ్చే తనతో పయనం నాకిష్టం
మరింత సమాచారం తెలుసుకోండి: