ప్రకృతి వైపరీత్యంతో కుంగిపోయిన ఎందరో జీవులను తలుస్తూ, వారిని ఉద్దేశిస్తూ రాస్తున్నానిలా...
తన పొట్టకు పోషకాలు అందించిన గోమాత ఈరోజు మట్టికి బలైపొయింది
తన జీవనాధారమైన వ్యవసాయం ఈరోజు సాయం అందివ్వలేనంటోంది
తన సర్వస్వం అయిన సుందరసౌధం ఈరోజు ఆశ్రయం కోల్పోయింది
తన ప్రాణం అయిన తన జీవితం సైతం ఈరోజు వరదల్లో తన ప్రయాణం వెతుక్కుంటూ కొట్టుకుపోయింది
వరదసాయం కోరే ఇలాంటి జీవితాలెన్నో
దైవం కరుణించక మరణించిన జీవితాలెన్నో
ఎన్నో బ్రతుకుల్లో ఇలాంటి దుర్భరక్షణాలెన్నో
తమకోసం ఎవరో వస్తారని ఆశించే ఎదురుచూపులెన్నో
ప్రతివాక్యం నలిగిపోయిన జీవితాలకు సాక్ష్యం
ప్రతిక్షణం దుర్భరమైన మరణాలకు సాక్ష్యం
ప్రతిమరణం కుంగిపోయిన బ్రతుకులకు సాక్ష్యం
ప్రతిబ్రతుకు మగ్గిపోతున్న జీవాలకు సాక్ష్యం
సాయమందిస్తున్న ఎన్నో చేతులకు
సహాయమందిస్తున్న ఎందరో ఉన్నతులకు
మేమున్నామని ఆదుకుంటున్న సంస్థలకు
ఈ హృదయవిదారక సంఘటనలకు తమ హృదయంతో స్పందిస్తున్న ఎందరో మహానుభావులకు ఈ నా చిరుకవిత అంకితం
మరింత సమాచారం తెలుసుకోండి: