రాష్ట్రవ్యాప్తంగా పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికల సంరంభం మొదలైంది. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 10 నగరపాలక సంస్థలు, 145 మున్సిపాలిటీలకు జరుగుతున్న ఈ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. పోలింగ్ వేళ ఎలాగైనా గెలిచేందుకు పార్టీల అభ్యర్థులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ వ్యవస్థ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలను మోహరించింది. శాంతియుతవాతావరణంలో ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 6 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. జిల్లాలోని ఆదిలాబాద్, మంచిర్యాల, కాగజ్ నగర్, బెల్లంపల్లి, భైంసా, నిర్మల్ మున్సిపాలిటీల్లో ఎన్నికల జరుగుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో రెండు కార్పొరేషన్లు, నాలుగు మున్సిపాలిటీలు, ఐదు నగర పంచాయితీలకు పోలింగ్ జరుగుతుంది. వరంగల్ జిల్లా పరకాల, జనగామ, మానుకోట మన్సిపాలిటీలు, భూపాలపల్లి, తదితర నగరపంచాయితీల్లో పోరుకు సకల ఏర్పాట్లూ పూర్తయ్యాయి. నిజామాబాద్ నగరపాలక సంస్థతోపాటు, జిల్లాలోని బోధన్ , కామారెడ్డి, ఆర్మూర్ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా తాండూర్ లో ఎన్నికల నిర్వహణకు అన్న ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖమ్మంజిల్లా సత్తుపల్లి, ఇల్లెందు, నల్గొండ జిల్లాలోని 5మున్సిపాలిటీలు, 2 నగర పంచాయితీలలో ఎన్నికలు జరుగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 50 కార్పొరేషన్ డివిజన్లతో పాటు 241 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 135 పోలిగ్ స్టేషన్లలో 5లక్షల 72వేల మంది తమ ఓటుహక్కును వినియోగించుకోబోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కార్పొరేషన్, అమలాపురం, తుని, మండపేట, సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం, రామచంద్రాపురం మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటితోపాటు, నగరపంచాయితీలైన ఏలేశ్వరం, గొల్లప్రోలు, ముమ్మిడివరం లకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. విజయనగరం జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలలోని 129 వార్డులకు 228 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. నెల్లూరు జిల్లా కార్పొరేషన్ తోపాటు కావలితోపాటు, కావలి, గూడూరు, వెంకటగిరి, నాయుడుపేట, ఆత్మకూరు, సూళ్లూరుపేట, పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు మున్సిపాలిటీలో 33 వార్డులకు గాను 32 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో పురపాలక పోరుకు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని చిత్తూరు పురపాలక సంస్థతోపాటు, పలమనేరు, మదనపల్లె, నగరి, పుత్తూరు, శ్రీకాళహస్తి పురపాలికలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ ప్రక్రియ సక్రమంగా జరిపేందుకు ఎన్నికల సంఘం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్నికలు శాంతియుతంగా జరిపేందుకు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: