ఎట్టకేలకు తెలంగాణలో ప్రచారం ముగిసింది. అందరు సీమాంద్రలో తమ బలం చూపించుకునేందుకు పోటీ పడుతున్నారు. తెలంగాణా, సీమాంద్రలో బిజేపి,టిడిపిలు సినిమా గ్లామర్ పై ఆశలు పెట్టుకుని వారితో ప్రచారాన్ని ఉదృతంగా చేయించాయి. ఇక్కడ టిఆర్ఎస్, అక్కడ వైకాపాలు మాత్రం కేవలం తమ అధినేతల బలంపైనే ఆశలు పెట్టుకుని ప్రచారం చేసాయి. ఇంతకీ సినిమా గ్లామర్ ఎంత, వారు ప్రజలను ఆకట్టుకుని వారిని నమ్ముకున్న పార్టీకి ఓట్లు తెచ్చేదెంత అన్నది అసలు ప్రశ్న. నిజానికి ఏపిలో ఎన్టీరామారావు తెలుగుదేశం పెట్టినప్పటి నుంచి సినిమా వాళ్ల గోల రాజకీయాల్లో ఎక్కువైంది. ఎన్టీఆర్ మాత్రం తన క్రేజి, ఇమేజి ఏంటో బ్రహ్మాండంగా చాటిచెప్పారు. ఆతర్వాత సినిమా వాళ్లు చూపిన ప్రభావం అంతంత మాత్రమే. రాజకీయాల్లోకి వచ్చిన సినిమా వారిని పరిశీలిస్తే కూడా అందులో టిడిపిదే అగ్రస్థానం. తర్వాత బిజేపిదే. ఇప్పుడు ఆ రెండు కలసి ఆ సినిమా వారినే నమ్ముకుని ప్రచారం చేస్తున్నాయి. ఇక సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చి బాగుపడి, వారి ఇమేజితో ఎవరైనా ఎదగారంటే మాత్రం లేదనే చెప్పవచ్చు. మురళీ మోహన్ ఇప్పటి వరకు ఎదిగింది లేదు. బాబు మోహన్ ఓ సారి గెలిసి మంత్రిగా అయినప్పటికి తర్వాత లాభం లేదు. కోట శ్రీనికవాసరావుది అదే పరిస్థితి. కృష్ణం రాజుకూడా ఎంపీగా గెలిచి, మంత్రిగా చేసినప్పటికీ పెద్దగా ప్రాభవం పొందింది లేదు. విజయశాంతి ఏకంగా ఓ కొత్త పార్టీ పెట్టినా కూడా ఎన్నికల దాకా ఆగనే లేదు. చిరంజీవి సంగతి అందరికీ తెలిసిందే. తర్వాత విజయశాంతి టిఆర్ఎస్ లో చేరి, అక్కడ పాతుకు పోలేక కాంగ్రెస్ లో చేని ఇప్పుడు ఎదురీదుతోంది. మరో నటి రోజా ఇప్పటి వరకు పార్టీలు మార్చడంలో రికార్డు కెక్కిందే తప్ప గెలిచింది లేదు. మరో నటి జయసుధ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికి రాజకీయంగా ఎదగలేదు. మరో నటి జయప్రద రాజకీయాల్లో పెద్దగా రాణించలేదు. ఇక సినిమా గ్లామర్ ఎంత వరకు పనిచేసిందో చెప్పడానికి ఈ ఉదహరణలు చాలు. కాని ఇంత కంటే పెద్ద ఉదాహరణలు మరికొన్ని ఉన్నాయి. 2004 ఎన్నికల్లో సినిమా వారి గోల కాస్తా తక్కువగా ఉన్నా కూడా 2009లో తప్పనిసరిగా గెలవాలని టిడిపి సినిమా వారిని సొమ్ముచేసుకోవాలని విశ్వ ప్రయత్నం చేసింది. అటు బాలకృష్ణను , సీనియర్ ఎన్టీఆర్ పోలికలతో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ను ప్రచారం పర్వంలోకి దించింది. వారిద్దరు తమ సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేసినా కూడా సాదించింది శూన్యం. టిడిపి అధికారంలోకి రాలేక పోయింది. చిరంజీవి ఏకంగా ప్రజారాజ్యం పెట్టి ఏం సాదించారు. అటు చిరంజీవి, అన్న కోసం పవన్ కళ్యాణ్ లు ఎంత కష్టపడ్డారు. వారి సభలకు వచ్చిన జనం చూసి ఎన్టీఆర్ రికార్డు బద్దలవుతుందేమో అని భావించారు. పలితాలు చూసాక తెలిసింది. సినిమా వారిని చూసేందుకే జనం వస్తారు కాని వారికి ఓటేయడానికి కాదని. ఇప్పుడు అదే చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు తోడు ఆలీ,వేణుమాదవ్ వంటి వారు కూడా తోడయ్యారు. వారు పాల్గొన్న సభలకు కూడా జనం రావడం షరామామూలుగానే జరిగింది, జరుగుతోంది. పలితాలు అంటారా.. సేమ్ రిపీట్ అయితే మాత్రం టిడిపి, బిజేపి నిండా మునిగినట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: