తెలంగాణలో హంగ్ తప్పదని ఎన్నికలు ప్రారంభమైన దగ్గర నుంచి వార్తలు వినిపిస్తూనే వున్నాయి. ఇప్పుడు ఎన్నికలు ముగిసాయి. తెరవెనకు మచ్చట్లు, లెక్కలు ప్రారంభమైపోయాయి. టీఆర్ఎస్ అధికారానికి సరిపాడా పూర్తి స్థాయి మెజార్టీ సంపాదించుకోవడం లేదన్న లోపాయికారీ వార్తలతో పాటు కొత్తగా వినిపిస్తున్న మాట, ఈసారి టీఆర్ఎస్ కు ఎక్కువ ఎంపీ స్థానాలు దక్కడ లేదన్నది. అటు కాంగ్రెస్, ఇటు భాజపా-తేదేపా కూటమి ఎంపీ స్థానాలను ఎగరేసుకుపోతాయని వార్తలు అందుతున్నాయి. దీనికి కీలక కారణం పట్టణ, నగర ఓటర్లలో ఈ సారి మోడీ ఫ్యాక్టర్ స్పష్టంగా కనిపించడం. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, తదితర ప్రాంతాల్లోని ఎంపీ సీట్లపై మోడీ, భాజపా-తేదేపా కూటమి ప్రభావం స్పష్టంగా కనిపించిదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. చిత్రంగా గతంలో కూడా టీఆర్ఎస్ ఏమీ ఎంపీస్థానాల్లో బలంగా లేదు. అయితే అదే సమయంలో ఓటింగ్ సరళి ఎమ్మెల్యెలకు సంబంధించి టీఆర్ఎస్ కు అనుకూలంగా సాగిందని కూడా వార్తలు వినవస్తున్నాయి. అయితే ఇక్కడ కూడా కాంగ్రెస్ కాస్త గట్టిపోటీనే ఇచ్చిందని వినికిడి. కాంగ్రెస్, ఎమ్ఐఎమ్ మద్దతు టీఆర్ఎస్ కు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనివార్యమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఇక్కడో సమస్య వుంది. ఎంపీ స్థానాలు టీఆర్ఎస్ కు సరిగ్గా రాని పక్షంలో, రాష్ట్రంలో అధికారం కోసం కాంగ్రెస్ తో బేరమాడ్డంలో అనుకూలతను కోల్పోతుంది. తనకు కావాల్సిన ఎంపీ స్థానాలు వచ్చినా, లేదా అవి భాజపాకు పోయినా, కాంగ్రెస్ పాత పగలు గుర్తు చేసుకుని టీఆర్ఎస్ ను ఓ రేంజ్ లో ఆడుగునే అవకాశం వుంది. తెలంగాణ ఇస్తే విలీనం చేస్తా అన్న మాట మరిచి, పొత్తుకు కూడా నో చెప్పిన కెసిఆర్ అంటే కాంగ్రెస్ మహా మంటగా వుంది. అది ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం వుంది. ఏదైనా టీఆర్ఎస్ కు ముందున్నవి అంత మంచి రోజులుగా కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: