చల్లని వాతావరణంలో కుండపోతగా వర్షం కురుస్తోంది. ప్రతి ఒక్కరి అడుగులు, తాము తడవకుండా దాక్కునేలా దారి తీస్తున్నాయి. వరుణుడి ప్రవాహం అందంగానూ, జనరంజకంగానూ కొనసాగుతుంది. అందంగా సాగుతున్న ఆ వర్షంలో ఒక అందమైన రూపం ఇంకా అందంగా నవ్వింది. వరుణుడు సైతం ఆగిపోయి అలా చూస్తున్నాడు, తనకన్నా అందంగా కురుస్తున్న ఆ వెన్నెల వర్షాన్ని.
ప్రకృతిసైతం ఆశ్చర్యపోయి చూస్తుంది తనకన్నా
సుందరంగా ఆకృతి దాల్చుకున్న ఆ రూపాన్ని.
సూర్యుడుసైతం సిగ్గుపడి చూస్తున్నాడు తనకన్నా
దేదీప్యమానంగా వెలుగుతున్న ఆ మనోహర వదనాన్ని
భూమిసైతం గర్వంగా చూస్తుంది తనకన్నా
కీర్తి గడిస్తున్న ఆ తేజోభరితమైన అందాన్ని
జనజీవనం మొత్తం తడుస్తూ చూస్తోంది తమకన్నా
అందంగా తడుస్తున్న ఆ నా స్వర్గలోకపు ప్రేమదేవతని
మరింత సమాచారం తెలుసుకోండి: