తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ మీడియాకు హెచ్చరికలు జారీ చేయడం సంచలన అంశంగా మారింది. ఇన్ని రోజులూ తాము ఆడిందే ఆటగా, పాడిందే పాటగా రెచ్చిపోయిన తెలుగు మీడియాలోని కొన్ని టీవీ చానళ్లు ఇక జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం వచ్చేసింది. మీడియాకు కేసీఆర్ ఒక మొగుడుగా తయారయ్యాడు. కామెడీ పేరుతో... రాజకీయ నేతలపై వెకిలి కామెంట్లు చేయడానికి ఒక చానల్ గత ఐదేళ్లుగా ఏ మాత్రం వెనుకడుగు వేయ లేదు. ఎవరినీ నొప్పించడానికి కాదని ఒకసారి, లైట్ తీస్కోవాలంటూ మరోసారి ఆ చానల్ తన పైత్యాన్ని చాటుకొంటోంది. అయితే ఈ ప్రోగ్రామ్స్ ను జనాలు కూడా కొంత వరకూ ఎంజాయ్ చేస్తున్నారు. జగన్ ను వెకిలిగా చూపిస్తే చంద్రబాబు అభిమానులు హ్యాపీగా ఫీలవుతారు. అదే కేసీఆర్ ను తెలంగాణ వాదులను నీఛంగా చూపిస్తే.. సమైక్యవాదులు, తెలుగుదేశం అభిమానులు ఆనందిస్తారు. ఇక బాబు మీద సెటైర్లు వేస్తే మిగతా వాళ్లంతా హ్యాపీగా ఫీలవుతారు. ఈ విధంగా మీడియా వర్గాలు సర్వైవ్ అవుతున్నాయి. ఈ సారి రెచ్చిపోయిన మీడియా తెలంగాణ శాసనసభ్యుల ప్రమాణస్వీకారోత్సవాన్నే టార్గెట్ చేసుకొని బుక్కైంది. దీంతో కేసీఆర్ రెచ్చిపోవడానికి అవకాశం దొరికింది. పనిలో పనిగా ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకోవాలని లేకపోతే.. తీవ్ర పరిణామాలకు కూడా సిద్ధంగా ఉండాలని కేసీఆర్ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశాడు. ఈ మీడియా ఎన్నికల ముందు కూడా జగన్ , కేసీఆర్ వంటి వాళ్లను సూటిగా టార్గెట్ చేసుకొంది. ఏదో ఒక కథనాన్ని వండి వార్చి తన పైత్యాన్ని చాటుకొంది. జగన్ మోహన్ రెడ్డి కూడా ఇలాంటి బాధితుడే. కాకపోతే జగన్ కేవలం తన కార్యకర్తల వద్ద మీడియా గురించి చెప్పుకొని బాధపడటమే తప్ప ఏమీ చేయలేకపోయాడు. కేసీఆర్ మాత్రం తీవ్రమైన హెచ్చరికనే చేశాడు. ఎంతైనా అధికారం ఆయన చేతిలో ఉంది కదా! బీ కేర్ ఫుల్ మీడియా!

మరింత సమాచారం తెలుసుకోండి: