ప్రతి సంవత్సరం ఆనవాయితిగా అత్యంత వైభవంగా జరుపుకునే దసరా పండుగ సందర్భంగా వినియోగ దారులు వ్యాపారుల చేతిలో దోపిడికి గురవుతున్నారు. వినియోగదారుల పండుగ సెంటిమెంట్ ను ఆసరగా చేసుకున్నటువంటి వ్యాపారులు అందినకాడికి దోచుకుంటున్నారు. పండుగ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు వారివారి స్థాయికి తగిన విధంగా నూతనంగా బట్టలు కొనుగోలు చేయడంతో పాటు వివిధ వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. కాగా దసరా పండుగ సందర్భంగా క్లాత్ షోరూంల వ్యాపారులు ఎక్కువ ధరకు బట్టలను విక్రయిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా అన్ని షాపుల్లో గిరాకి ఎక్కువగా ఉండడంతో ఇదే అవకాశంగా భావిస్తున్నటువంటి వ్యాపారులు వినియోగదారుల నుండి లాభాలు పొందుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ పండుగను మహిళలు సెంటిమెంట్ పండుగగా జరుపుకుంటారు. అన్ని వర్గాల మహిళలు ఈ పండుగ సందర్భంగా నూతన వస్త్రాలను కొనుగోలు చేసి ధరించడం ఆనవాయితిగా వస్తుంది. దీంతో పాటు దుర్గాష్టామి, దసరా పండుగ కూడా ఈ సందర్భంగా కలిసి రావడంతో ప్రతి కుటుంబంలో దాదాపు అందరు నూతన వస్త్రాలను కొనుగోలు చేయడం జరుగుతుంది. దీంతో ఎలాగైనా పండుగ సందర్భంగా కొనుగోలు చేస్తారని భావించి వ్యాపారులు ధరను పెంచి విక్రయిస్తున్నారు. కాగా మహిళలకు కావాల్సిన వస్తువుల కొనుగోలు చేసేటువంటి ప్రతి షాపులో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. గాజులు కొనుగోలు చేయడంతో పాటు నుదుటి బొట్టు వరకు ప్రతి వస్తువు కొనుగోలులో వ్యాపారులు వారికి అందినకాడికి దోచుకుంటున్నారు. కాగా ఇక పండుగ సందర్భంగా బట్టలు కుట్టేటువంటి టైలర్ షాపులు కూడా దసరా పండుగ సందర్భంగా కుట్టుకూలిని పెంచేశారు. ఇలా పండుగ సందర్భంగా కొనుగోలులో వినియోగ దారులు నష్టపోతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే పండుగ సందర్భంగా ప్రైవేట్ వాహనదారులు ప్రయాణికులను దోచుకుంటున్నారు. పండుగ సందర్భంగా సంబంధిత ఆర్టీసి ప్రయాణికులకు సరిపడ బస్సులు నడుపక పోవడంతో విధిలేని పరిస్థితిలో ప్రైటేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావించినటువంటి వాహనదారులు రెట్టింపు ధరను వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు బస్సు చార్జీలు 50 రూపాయలుంటే ప్రైవేట్ వాహనాదారులు 80నుండి 100వరకు సమయం చూసి వసూలు చేస్తున్నారు. ఇలా పండుగ సందర్భంగా విధిలేని పరిస్థితిలో ప్రజలు వ్యాపారుల చేతిలో ఆర్థికంగా నష్టపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: