మనకు జరిగన అన్యాయాల లిస్టులో మొదటి స్థానం రైల్వేదే! ఇటు పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య, ప్రమాదాలు, రవాణా అవసరాలు వెరసి మనకు మాత్రం రైళ్ళ విషయంలో చాలా అన్యాయం జరుగుతోంది. దాదాపు పదిహేన్నేల్లుగా తూర్పు భారత దేశ ఎంపిలే రైల్వే మంత్రులుగా ఉంటూ దక్షిణాదిని పూర్తిగా విస్మరించారు. ఆదాయంలో మన దక్షిణ మధ్య రైల్వే దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నా మన నోటికి ఎప్పుడూ మట్టే. ప్రస్తుతమున్న ప్రతిపాదనలకి పదిహేను వేల కోట్ల అవసరం ఉన్నా ప్రతి ఏడు మనకు కష్టంగా పదేహేను వందల కోట్ల మాత్రమే ఇస్తున్నారు. ఈ లెక్కన చూస్తే ఉన్న ప్రాజెక్టులు పూర్తి చెయ్యడానికి కనీసం పదేళ్ళు పడుతుంది . ఈ సమయంలో ఒక ఆఖరి ఆశ రైల్వే శాకా సహాయమంత్రిగా నియమితులు అయిన కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి. యుపీఎ రెండో హయాంలో ఆఖరి రైల్వే బడ్జెట్ 2013 లో ఉండబోతోంది. చూద్దాం మన ప్రాప్తం ఎంతో. 

మరింత సమాచారం తెలుసుకోండి: