ఒక్కో పార్టీది ఒక్కో తాపత్రయం. తెరాసకేమో ఉద్యమం పేరుతో సీట్లు, ఓట్లు కావాలి, తేదేపాకు పూర్వపు వైభవం కావాలి, కమలనాథులకు పాగా వెయ్యడానికి ఒక సందు దొరికితే చాలు, వైఎస్ఆర్ సిపీకు కొత్త వాళ్ళు వస్తే చాలు,కాంగ్రెస్కి ఉన్నవి ఊడకొట్టుకోకుండా ఉంటె అదే పది వేలు. పాదయాత్రలు చేస్తున్న బాబు, షర్మిలలు తాము వస్తే ఏమి చేస్తామో అంటున్నారు గాని, ప్రస్తుతానికి ప్రభుత్వాన్ని మెడలు వంచి ఎలా ప్రజా సమస్యలను పరిష్కరిస్తారో చెప్పట్లేదు. అంటే జనం వీరి రాక కోసం 2014 వరకు వేచిచూడాల్సిందే. ఇదెలా ఉందంటే అన్నంలేని వాళ్ళకు కొద్ది రోజులు ఓపిక పట్టండి, మేము వచ్చాక అన్నం పెడతాం అన్నట్టు. ఐక్య ఉద్యమంతో అందరూ కలిసి ప్రభుత్వాన్నిఉక్కిరి బిక్కిరి చెయ్యొచ్చు. కానీ పొరపాటుగా కూడా అది చెయ్యరు, ఎందుకంటే క్రెడిట్ ఎవ్వరికీ పోతుందోనని భయం. ఈ విషయంలో సిపీఎం రాఘవులు మొదట ప్రయత్నించినా, తెదేపా, వైఎస్అర సిపీ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనేటట్లు ఉండడంతో ఈ ప్రతిపాదన ముందుకు వెళ్ళలేదు. ఇక ఏడాదిన్నరలో ఎన్నికలు ఉండడంతో ఎవ్వరి వ్యుహల్లో వారు బిజీ. మరి మమ్మల్ని ఎవ్వరు పట్టించుకుంటారని జనం అడిగితే, అదిగో మీ కోసమే అని అంటారు.సరే మరి అధికార కాంగ్రెస్ అన్నా పట్టించుకుంటారా అంటే, అదీ లేదాయే కిరణ్ సార్ ఇందిరమ్మ బాటలో బిజీ, నేను ఒక హీరో అని చెప్పుకోడానికి. 

మరింత సమాచారం తెలుసుకోండి: