దేశ భాషలలో తెలుగు లెస్సా అని మన సాహితీవేత్తలు ఎంతో అభిమానంతో అన్నారు. కానీ నేడు రాష్త్రావతరణ దినోత్సవాన్ని ఎంత బాగా చేస్తున్నారో. మన రాజకీయ నాయకులు వాళ్ళ సంకుచిత స్వభావంతో తెలంగాణా, ఆంధ్ర పేరుతో విడిపోయి ఒకరినొకరు దూషించుకుంటూ ఉంటున్నారు.  తెలంగాణా వారికి ఇది నచ్చకపోయినా సరే, ఒక విధంగా తెలుగు వారికి యాభయ్ ఆరేళ్ళ క్రితం దక్కిన గౌరవం. భాష ప్రాతిపదిక మీద ఏర్పడ్డ మొదటి రాష్త్రం. ఇష్టం లేక పోతే పోవొచ్చుగాక కానీ పొరుగు వారిముందు ఇంత నవ్వలపాలు కావాల్సిన అవసరంలేదు. మన రేంజ్ అంత కాకపోయినా కర్ణాటకలో కూడా కూర్గ్ ప్రాంతం, హైదరాబాద్ కర్ణాటక ప్రాంతం వారూ ప్రత్యేక రాష్త్రం కోరుకుంటున్న వారే. కానీ వారి రాష్త్రావతరణను భాషకు ముడి పెట్టి, దాన్ని రాజ్యోత్సవం పీరుతో ప్రతి ఏటా ఘనంగా జరుపుకుంటారు. మన భాషకు సంస్కృతికి ఏ లోటు లేదు, భిన్న ప్రాంతాల కలయిక మనం, అయినా తెలుగుకు, తెలుగువారికి పట్టిన దుస్థితి ఎవ్వరికీ రాకుడదని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: