రాజకీయాలలో శాశ్వత శత్రువులు లేరంటారు. అది నిజమే,కేవలం గోడ దూకడానికి మాత్రమే కాదు,ఇలాంటి విషాద సమయాల్లో ఒక్కోసారి నాయకుల స్పందన చూస్తే ఇలానే అనిపిస్తుంది. పరస్పరం ఘోరంగా దూషించుకున్నా ఒక్కప్పుడు తెరాస నాయకులు చాలా మంది తెదేపా నుండి బయటకు వచ్చిన వాళ్లే. ఇవ్వాళ తెరాస నాయకుడు ఈటెల రాజేందర్ మాటలు అలానే ఉన్నాయి. 2008 లో తెదేపా తెలంగాణాకు అనుకూలంగా లేఖ ఇవ్వడంలో ఎర్రనయుడి పాత్ర చాలా ఉందని ఆయనను గుర్తు చేసుకున్నాడు. ఇంతటి రాజకీయ పరిణితి మామూలు సమయాల్లో కూడా ఇలానే ఉంటె ఎంత బాగుంటుందో కదా. ఈ విషాదాన్ని కాస్త అటుంచితే ఈ మధ్య బాబు కేసిఆర్ ను పెద్దగా విమర్శిన్చట్ట్లేదు.అలాగే తెరాస కూడా తెదేపా ఫై ఇంతకు ముందులా నోరు జారట్లేదు. వీళ్ళ పొత్తులు అలా ఉంచితే ముందు మన రాష్త్రంలో పార్టీల మధ్య కాస్తయినా సఖ్యత ఉంటె అదే పదివేలు, అప్పుడు సమస్యలను (తెలంగాణాతో సహా) పరిష్కరించడం అంత కష్తం కాదేమో! 

మరింత సమాచారం తెలుసుకోండి: